డిచ్పల్లి, నవంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం వృక్ష శాస్త్ర విభాగంలో మంగళవారం పిహెచ్డి డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. వక్షశాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ అరుణ పర్యవేక్షణలో ఎన్.నాగ సమీర అనే పరిశోధక విద్యార్థిని ”బయోడైవర్సిటీ ఆఫ్ ఆల్గె ఇన్ అశోక్ సాగర్ అండ్ ఆలీ సాగర్ లేక్స్ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్” అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు.
తెయూ సెమినార్ హాల్లో జరిగిన పిహెచ్డి వైవా వోస్ కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరాఠ్వాడ విశ్వవిద్యాలయం, ఔరంగబాద్కి చెందిన ఆచార్య సహేరా నస్రీన్ విషయనిపుణులుగా వ్యవహరించారు. పరిశోధక విద్యార్థిని తన పరిశోధక ఫలితాలను పవర్‌పాయింట్ ద్వారా వివరించారు. జిల్లాలోని అశోక్ సాగర్, అలీ సాగర్‌లో పెరుగుతున్న శైవలాలు వాటి అభివద్ధి, వాటిలో వచ్చే మార్పుల గూర్చి వివరించారు.
దీనిపై సంతప్తి చెంది విద్యార్థినికి డాక్టరేట్ అవార్డు ప్రకటించారు. కార్యక్రమంలో వక్షశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఆహ్మద్ అబ్దుల్ హాలీమ్ డాక్టర్, బివోఎస్ డా.ఎం. అరుణ, ఆచార్య డాక్టర్ బి.విద్యావర్ధిని, డా.దేవరాజు శ్రీనివాస్, డా.వి.జలంధర్ మరియు పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- భూ సమస్యల పరిష్కారానికి మరిన్ని ఆదేశాలు - January 16, 2021
- డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్ష ఫలితాలు విడుదల - January 16, 2021
- 31 లోగా పూర్తిచేయాలి - January 16, 2021