నిజామాబాద్, నవంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం బర్కత్‌పుర రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నిజామాబాద్ రూరల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోటరీ కత్రిమ కేంద్రానికి జిల్లా న్యాయాధికారి రమాదేవి హాజరై మాట్లాడారు. కేంద్రం ద్వారా అందజేస్తున్న కత్రిమ కాలు జైపూర్ ఫుట్ శిబిరంలోని బాధితులకు కత్రిమంగా తయారుచేసిన కాళ్లను అందజేస్తూ మరొక జన్మనిస్తున్నటువంటి రోటరీ క్లబ్ నిజామాబాద్ సంస్థకి అభినందనలు తెలిపారు.
మానవసేవే మాధవసేవ అని, సభ్యులంతా దేవుని రూపంలో ఉన్న మనుషులని ఇంతటి మహత్కార్యం నిర్వహిస్తున్నందుకు నమస్కారములు తెలిపారు. అనివార్య కారణాల వల్ల మనం కాళ్లను కోల్పోయిన మన నిర్లక్ష్యం వల్ల కోల్పోయిన మరొక జన్మను కత్రిమంగా తయారుచేసిన కాళ్లను అందిస్తూ రోటరీ క్లబ్ మరొక జన్మనిస్తుందని కొనియాడారు.
కార్యక్రమంలో అధ్యక్షులు దర్శన్ సింగ్ సోకి, కార్యదర్శి బాబురావు, రోటరీ ట్రస్టు కార్యదర్శి జగదీశ్వర రావు, లింబ్ సెంటర్ చైర్మన్ శ్రీనివాసరావు, ట్రస్ట్ కోశాధికారి సతీష్ షాహ్, సి హరి ప్రసాద్, రాజ్‌కుమార్ సుబేదార్, జ్ఞాన ప్రకాష్, రమేష్, తదితర సభ్యులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- పంటల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి - January 28, 2021
- చిరుధాన్యాలైన కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి - January 28, 2021
- 29న మంత్రి పర్యటన వివరాలు - January 28, 2021