కామారెడ్డి, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొక్కజొన్న కొనుగోళ్లను డిసెంబరు 15 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. గురువారం జనహిత భవన్లో వ్యవసాయశాఖ, మార్క్ఫెడ్ అధికారులతో మొక్కజొన్న కొనుగోలుకు చేపట్టే చర్యలను ఆయన సమీక్షించారు.
జిల్లాలో 37 కొనుగోలు కేంద్రాల ద్వారా చేపట్టే కొనుగోళ్లలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని, మధ్య దళారుల ప్రమేయం లేకుండా, బయట కొని కేంద్రాలలో అమ్మినా, లెక్కలలో తారుమారు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఏ కొనుగోలు కేంద్రంలో ఎప్పుడు ప్రారంభించేది, పూర్తి చేసేది పక్కా ప్రణాళితో నిర్వహించాలని, మార్క్ఫెడ్ అధికారులు రవాణా చర్యలను పటిష్టంగా నిర్వహించాలని, అవసరమైతే రైతులతో సమావేశమై కొనుగోళ్లను సులభతరం చేసుకొని పూర్తి చేయాలని ఆదేశించారు.
సమావేశంలో జిల్లా అదనపు కలెక్టరు పి.యాదిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టరు హేమంత్ కేశవ్ పాటిల్, ఆర్డిఓ కామారెడ్డి శ్రీను, ఆర్డిఓ బాన్సువాడ రాజాగౌడ్, మార్క్ఫెడ్ డిఎం రంజిత్ రెడ్డి, జిల్లా వ్యవసాయ ఇన్ ఛార్జీ అధికారి సునీత, వ్యవసాయ శాఖ ఎడి, ఎఓలు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- భూ సమస్యల పరిష్కారానికి మరిన్ని ఆదేశాలు - January 16, 2021
- డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్ష ఫలితాలు విడుదల - January 16, 2021
- 31 లోగా పూర్తిచేయాలి - January 16, 2021