నిజామాబాద్, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం ప్రగతి భవన్లో భారత రాజ్యాంగం ఆమోదించిన రోజును పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ముఖ్యఅతిథిగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం భారత దేశానికి రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా తయారుచేయడానికి ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి చర్చించి, శోధించి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు.
దేశంలో ఎన్నో కులాలు, మతాలు, వర్గాలను, వారి జీవన పరిస్థితులను దష్టిలో పెట్టుకొని రూపొందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే ఎన్నో దేశాలకు దిక్సూచిగా నిలవడమే కాకుండా ప్రశంసలు పొందిందని, దేశంలోని తరతమ భేదాలు లేకుండా పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందని పేర్కొన్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారని కలెక్టర్ వివరించారు.
మనకు ఎన్నో హక్కులను కల్పించిన రాజ్యాంగం పట్ల మనమందరం ఎంతో గౌరవంగా భావించాల్సిన అవసరం ఉన్నదని, ఈరోజు మనమందరం గర్వపడే రోజుగా ప్రతి సంవత్సరం ఈ రోజును ఒక ముఖ్యమైన రోజుగా, మనమంతా గర్వపడే దినోత్సవంగా జరుపుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ఈ సందర్భంగా హాజరైన అధికారులు, సిబ్బందితో రాజ్యాంగ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర సమన్వయకర్త శైలి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి సంధ్యారాణి, అధికారులు, ప్రగతి భవనం, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- ప్రారంభానికి సిద్ధం చేశాం… - January 28, 2021
- పంటల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి - January 28, 2021
- చిరుధాన్యాలైన కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి - January 28, 2021