కామారెడ్డి, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం నర్సన్నపల్లి ధాన్యం గోదామును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ పరిశీలించారు. అనంతరం ఎస్.ఎస్.నగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేందాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఏర్పడ్డాయా అని అడిగారు.
కొనుగోలులో ఎలాంటి సమస్యలు లేవని రైతులు తెలిపారు. అనంతరం బికనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో రైస్ మిల్లును సందర్శించి కస్టమ్ మిల్లింగ్ రైస్ విధానాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, జిల్లా అదనపు కలెక్టరు పి.యాదిరెడ్డి, అసిప్టెంట్ కలెక్టరు హేమంత్ కేశవ్ పాటిల్, డిఎం సివిల్ సప్లయ్ రంజిత్ కుమార్, డిఎస్ఓ కొండల్ రావు, అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- భూ సమస్యల పరిష్కారానికి మరిన్ని ఆదేశాలు - January 16, 2021
- డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్ష ఫలితాలు విడుదల - January 16, 2021
- 31 లోగా పూర్తిచేయాలి - January 16, 2021