Breaking News

Daily Archives: November 28, 2020

ధరణి కార్యాలయానికి రూ. 9 లక్షలు

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న తసీల్ధార్‌లతో ధరణి పై నిజామాబాద్‌ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ధరణిలో ఇప్పటి వరకు 1585 స్లాట్‌ బుకింగ్‌ జరిగాయని, అందులో 1528 రిజిస్టర్‌ అయినవి, 57 మాత్రమే పెండింగ్‌ వున్నవని, అదేవిధంగా ప్రతి మండలంలో ధరణి కార్యాలయానికి 9 లక్షలు మంజూరు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి చెప్పారు. కావున ప్రతి మండలంలో ఒక మంచి కార్యాలయంతో పాటు సదుపాయాలు ఇతర అవసరాలకు మంజూరు చేశారని పేర్కొన్నారు. దీనికి ...

Read More »

అబలలు కాదు సబలలు

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అతి చిన్న వయస్సులో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా పదవి పొందిన కుమారి నిట్టు జాహ్నవిని అతి పిన్న వయస్సులోనే ఎవరైస్టు శిఖరాన్ని అధిరోహించి భరత జాతి ఖ్యాతిని ఇనుమడించిన మాలోతు పూర్ణ అభినందించారు. స్థానిక సమన్య హోటల్‌లో మున్సిపల్‌ చైర్పర్సన్‌ను మాలోతు పూర్ణ కలిసి అభినందనలు తెలుపుతూ, తెలంగాణ రాష్ట్రంలోనే కామారెడ్డి మున్సిపాలిటీని అగ్రశ్రేణిగా తీర్చిదిద్దాలని ఆమె ఆకాక్షించారు. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించవచ్చునని, ఆడవారు అబలలు కాదు సబలలు అని, అన్ని ...

Read More »

సర్వేలో పారదర్శకత పాటించాలి

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల భాగస్వామ్యంతో మిషన్‌ అంత్యోదయ సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారులకు సూచించారు. శనివారం జనహితలో డివిజనల్‌ పంచాయితీ అధికారులు, మండల పంచాయితీ అధికారులు, పంచాయితీ రాజ్‌ డివిజనల్‌ ఇంజనీర్లు, అసిస్టెంట్‌ ఇంజనీర్లు, ఎపిఓ ఎపిడిలు, రిలయన్స్‌ స్వచ్చంద సంస్థ ప్రతినిథులకు నిర్వహించబడిన మిషన్‌ అంత్యోదయ సర్వే శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శిక్షణ కార్యక్రమంలో పూర్తి అవగాహన పొందాలని, అనంతరం మండల స్థాయిలో గ్రామ ...

Read More »

మొక్కల చుట్టూ పాదులు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరిత హారంలో నాటిన మొక్కలను సంరక్షణ చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అన్నారు. శనివారం ఆయన టేక్రియల్‌ చౌరస్తా వద్ద హరిత హారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. నాటిన మొక్కల చుట్టూ పాదులు ఏర్పాటుచేసి, రక్షణ కంచె వేయాలని సూచించారు. మొక్కలు ఎండిపోకుండా మునిసిపల్‌ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. పాత జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను సంరక్షణ చేయాలని కోరారు. మొక్కలు ఏపుగా పెరిగి స్వచ్ఛమైన ...

Read More »

పదవీ విరమణ

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పౌర సంబంధాల అధికారి, కామారెడ్డి కార్యాలయములో పబ్లిసిటీ అసిస్టెంట్‌గా పనిచేస్తూ ప్రభుత్వ సర్వీసు నుండి శనివారం పదవీ విరమణ చేసిన వస్తాద్‌ గంగాధర్‌ గౌడ్‌ను జిల్లా పౌర సంబంధాల అధికారి పి.వెంకటేశ్వరరావు సన్మానించారు. కార్యక్రమంలో కార్యాలయ టైపిష్టు దేవుజి, పిఆర్‌టియు తెలంగాణ జిల్లా అధ్యక్షులు అంభీర్‌ మనోహర్‌ రావు, సునీత, కళాకారులు రమేశ్‌ రావు, మల్లిఖార్జున్‌, శ్రీనివాస్‌, పోశెట్టి పాల్గొన్నారు.

Read More »

జ్యోతి బా ఫూలే స్ఫూర్తిగా ముందుకు సాగాలి

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అఖిల భారతీయ ప్రజా సేవ సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా కార్యాలయంలో జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించినట్టు జిల్లా ఇంచార్జ్‌ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కషి చేయాలని, మహాత్మా జ్యోతిబా పూలే స్ఫూర్తిగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలన్నారు. అట్టడుగు ...

Read More »

రైతు వేదికలు, క్రిమిటోరియం, సిడిపి, ఎంపీ లాడ్స్‌ పనులు పూర్తి కావాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంపీ లాడ్స్‌ నిధులతో చేపట్టిన పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్సులో ఎంపి లాడ్స్‌, రైతు వేదికలు, క్రిమిటోరియం, సిడిపి పంచాయతీ రాజ్‌, శాఖ ఈఈ, డిఈ, ఏఈ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు వేదికలు, క్రిమిటోరియం, సిడిపి పనుల అభివద్ధి గురించి మండలాల వారీగా సమీక్షించారు. రైతు వేదికలు శనివారం వరకు పనులు పూర్తి ...

Read More »

గిన్నిస్‌ రికార్డు గ్రహీతకు కలెక్టర్‌ ప్రశంసలు

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అతి చిన్న వయసులోనే గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సాధించిన జిల్లా కేంద్రానికి చెందిన తేలి విభా శ్రీ ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ప్రశంసించారు. సుభాష్‌ నగర్‌ వాసులైన విజయ్‌ కుమార్‌, ప్రసన్నల కూతురు విభా శ్రీ ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్లో ఫస్ట్‌ క్లాస్‌ చదువుతు తన ఎల్‌కెజి, యూకేజీ చదువుతున్న రోజుల్లోనే ఆయా కళారంగాలలో అద్భుతమైన ప్రదర్శనలు చేసి ఆహుతులను అలరించింది. దీంతో ...

Read More »

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిఘా

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాంతి భద్రతల పరిరక్షణ కొరకై పోలీస్‌ శాఖ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటుందని నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేటు పరిధిలోని ప్రజలు సద్భావన, జీవన విధానం ఆదర్శవంతమైనవని ఇటువంటి వాతావరణానికి భంగం కలిగించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. అల్లరిమూకల దుష్ప్రచారాలు, వదంతుల (రూమర్స్‌) పట్ల ప్రతి ఒక్కరూ జాగరూకులై ఉండాలని, అదే విధంగా పోలీసు శాఖ సంఘ విద్రోహమూకపై గట్టి నిఘా ఉంచుతున్నామని, ...

Read More »

పరీక్షలు వాయిదా – ఆన్‌లైన్‌ తరగతులు యధాతథం

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిసెంబర్‌ 1వ తేదీ నుండి నిర్వహించబడే బి.ఏ. బి.కాం, బి.వి. ఏ.బి.యస్సీ. 2వ, 4వ సెమిస్టరు (రెగ్యూలర్‌) (2019-20) మరియు 1వ, 2వ, 3వ సెమిస్టరు (బ్యాక్‌లాగ్‌) పరీక్షలను విద్యార్థుల అభ్యర్ధన మేరకు వాయిదా వేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మినారాయణ, కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి వై.వేణుప్రసాద్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పైన తెలిపిన పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామన్నారు. 3వ సెమిస్టరు (రెగ్యులర్‌) ...

Read More »