నిర్మల్, నవంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ఫ్ భరోసా యాత్రలో భాగంగా డిసెంబర్ 2న ఉదయం నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన వలస కార్మికులకు అవగాహన, చైతన్య కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల ఒక ప్రకటనలో తెలిపారు.
గల్ఫ్ దేశాల నుండి వాపస్ వచ్చినవారు జీతం బకాయిలు మరియు బోనస్, పిఎఫ్, గ్రాట్యుటీ లాంటి ‘ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్’ (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) రాబట్టుకోవడం ఎలా అనే విషయాలపై కార్యక్రమంలో వివరిస్తామని చెప్పారు. ‘జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్’ అనే నినాదంతో జీతం దొంగతనం గురించి న్యాయ పోరాటానికి అంతర్జాతీయ సంస్థలతో తాము సంప్రదిస్తున్నామని స్వదేశ్ వివరించారు.
విదేశీ లేబర్ కోర్టులలో న్యాయ పోరాటానికి కావలసిన ‘లీగల్ ఎయిడ్’ (న్యాయ సహాయం) అందించడానికి తమ సంస్థ కషి చేస్తుందని, సలహాలు, సహాయం కోసం ప్రవాసి మిత్ర హెల్ప్ లైన్ నెంబర్లు 91 94916 13129 మరియు 91 78158 37704 కు సంప్రదించాలని ఆయన కోరారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- బోధన్ ప్రాంత ప్రజలు అలర్ట్ - April 19, 2021
- రెండు రోజుల్లో ఇద్దరి మృతి - April 19, 2021
- ఎక్కడివక్కడే… ఏమిటివి… - April 19, 2021