నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే నెలలో వ్యాక్సిన్ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నందున సంబంధిత శాఖల అధికారులు అందుకు అవసరమైన ఏర్పాటు చేసుకోవాలని అదనపు కలెక్టర్ లత కోరారు. గురువారం జిల్లా అధికారులతో ప్రగతి భవన్ సమావేశ మందిరంలో కరోనా వ్యాక్సిన్‌కు సిద్ధం కావడంపై జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కమిటీలో జిల్లా అధికారులను సభ్యులుగా నియమించినట్లు తెలిపారు. జనవరిలో వ్యాక్సిన్ రానున్నట్లు తెలుస్తున్నందున అందుకు సంబంధించి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. ...
Read More »Monthly Archives: December 2020
నూతన సంవత్సర శుభాకాంక్షలు
నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2021 నూతన సంవత్సరం పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సందేశం తెలిపారు. ”నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల ప్రజలకు 2021 నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో సుఖ, సంతోషాలతో, సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివద్ధి పథంలో నడుస్తోందని, ...
Read More »ఆపరేషన్ స్మైల్ ప్రారంభం
నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు డి.సి.పి (అడ్మిన్) ఉషా విశ్వనాధ్ తిరునగరి ఆపరేషన్ స్మైల్ 7 ప్రారంభించారు. ఈ సందర్బంగా అదనపు డి.సి.పి (అడ్మిన్) ఉషా విశ్వనాధ్ తిరునగరి మాట్లాడుతూ అవరేషన్ స్మైల్ 2021 జనవరి 1 నుండి 31 జనవరి వరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో 18 సంవత్సరాల లోవు తప్పిపోయిన / ...
Read More »కలెక్టర్, ఎమ్మెల్యేదే బాధ్యత
కామారెడ్డి, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి డిగ్రీ కళాశాల భూములకు సంబంధించిన సర్వేను సర్వేయర్లు అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడి సక్రమంగా చేయడం లేదని, ఆక్రమణలకు గురైన ప్రాంతంలోని భూముల సర్వేను సర్వేయర్లు చేయడం లేదని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం అన్నారు. వారం రోజుల క్రితం భూముల సర్వేకు సంబంధించి ఏర్పాటు చేసిన హద్దులను గుర్తుతెలియని వ్యక్తులు తొలగించడం జరిగిందని వెంటనే జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చొరవ తీసుకుని ...
Read More »జిల్లా కలెక్టర్‌కు డిజిటల్ ఇండియా 2020 అవార్డు
కామారెడ్డి, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిజిటల్ ఇండియా 2020 అవార్డును భారత రాష్ట్రపతి నుండి కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అందుకున్నారు. బుధవారం ఉదయం కొత్త ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వర్చువల్ పద్ధతిలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిజిటల్ ఇండియా 2020 అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఎక్సలెన్స్ ఇన్ డిజిటల్ గవర్నెన్స్ డిస్ట్రిక్ట్ క్యాటగిరిలో సిల్వర్ అవార్డును భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుండి జిల్లా కలెక్టర్ అందుకున్నారు. జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా ...
Read More »రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత
నిజామాబాద్, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తహసిల్దార్లు సమస్యలు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం ప్రగతి భవన్లో తహసీల్దార్లు, ఆర్అండ్బి ఏఇలతో డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్లు, ధరణిపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలకు ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తున్నదని కావున తొందరగా పూర్తి కావాలని, గత సంవత్సరం కరోన వలన ...
Read More »న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుశాఖ హెచ్చరికలు
నిజామాబాద్, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిసెంబర్ 31న రాత్రి ప్రజలు వ్యవహరించాల్సిన తీరుపై నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తికేయ పలు సూచనలు చేశారు. కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో డిసెంబర్ 31న రాత్రి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే సందర్భంగా కమీషనరేటు పరిధిలోని వైన్స్, కల్లు దుకాణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి పొందిన సమయం వరకే మధ్యం విక్రయించాలన్నారు. అలా కాకుండా ప్రభుత్వం నుండి అనుమతి పొందిన సమయం దాటిన ...
Read More »కేజివీల్స్ రోడ్లపై తిప్పడం చట్టరీత్యా నేరం
ఆర్మూర్, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వాలు ప్రజల అవసరాల కోసం నిర్మించిన ప్రజా ప్రభుత్వ రోడ్లపై వ్యవసాయ భూములు దున్నడం కోసం ట్రాక్టర్ ఓనర్లు కేజివీల్స్ తో తిప్పడం వల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయని, కావున ప్రజా, ప్రభుత్వ ఆస్తులైన రోడ్లు ధ్వంసం చేయడం చట్టరీత్యా నేరమని ఏర్గట్ల మండల కేజివీల్ ట్రాక్టర్స్ యజమానులకు ఏర్గట్ల పోలీస్ వారు సూచించారు. కేజివీల్ ట్రాక్టర్స్ని సీజ్ చేసి కేసు నమోదు చేయబడుతుందని, రోడ్లు డ్యామేజ్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ...
Read More »సీనియర్ సిటిజన్స్ కొరకు హెల్ప్‌లైన్ 14567
నిజామాబాద్, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీనియర్ సిటిజన్స్‌కు అవసరమైన సహాయం అందించడానికి హెల్ప్ లైన్ నెంబర్ 14567 కు కాల్ చేయవచ్చని జిల్లా వెల్ఫేర్ అధికారి ఝాన్సీ లక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. సలహాలు, సూచనలు, పెన్షన్లు చట్టపరమైన సూచనలు, న్యాయపరమైన సలహాలు వద్ధాప్య గహాలు కౌన్సిలింగ్ మరెన్నో విషయాన్ని తెలియజేయడానికి కిట్, టోల్ ఫ్రీ నెంబర్ వయో వద్ధులు ఉపయోగించుకోవాలని ఆమె ప్రకటనలో కోరారు.
Read More »వ్యవసాయంలో యంత్రాల ఉపయోగంపై అవగాహన కలిగి ఉండాలి
నిజామాబాద్, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కూలీల కొరతతో పాటు ఖర్చులు తగ్గించుకోవడానికి యంత్రాలు ఉపయోగం వల్ల రైతులకు పలు రకాలుగా ప్రయోజనాలు కలిగి ఉన్నందున వ్యవసాయ పనులకు యంత్రాల వాడకంపై రైతులు అవగాహన ఏర్పర్చుకొని ఆ దిశగా ఆలోచించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సూచించారు. కూలీల కొరత ఏర్పడటంతో పాటు కూలి ఖర్చులు కూడా పెరగడం తద్వారా వ్యవసాయానికి ఖర్చులు పెరగడం, రైతులకు ఇబ్బందులు ఎదురు కావడం ఇతర విషయాలను దష్టిలో పెట్టుకొని యంత్రాలు ఉపయోగంపై ...
Read More »యు.కె.స్ట్రెయిన్ భయంకరమైనది కాదు
హైదరాబాద్, డిసెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యు కే స్ట్రెయిన్ భయంకరమైనది కాదని, దీనికి ఎక్కువ చంపే శక్తి లేదని, ఎక్కువ మందికి వ్యాప్తి చెందిస్తుంది అని నిపుణులు చెప్తున్నారని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రస్తుతం పాత పద్దతిలోనే చికిత్స అందిస్తున్నామని, 10 నెలలుగా ప్రజలు భయంతో ఉన్నారన్నారు. ఇంకా ప్రచార మాధ్యమాలు ప్రజలను భయపెట్టవద్దని, కరోనా వైరస్ చలికాలంలో వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ...
Read More »జనవరి 20 నుంచి ఫిబ్రవరి 10 వరకు నిధి సేకరణ
కామారెడ్డి, డిసెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంతోమంది కరసేవకుల త్యాగము, కషి ఫలితంగా శతాబ్దాల అనంతరం హిందువుల ఆరాధ్య దైవం అయిన భగవాన్ శ్రీ రాముని భవ్య మందిర నిర్మాణం రాజ్యాంగబద్ధంగా ప్రారంభమైందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దక్షిణ మధ్య క్షేత్ర ధర్మ జాగరణ ప్రముఖ్ అమర లింగన్న అన్నారు. శ్రీరామ భవ్యమందిర నిర్మాణ నేపథ్యంలో శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కామారెడ్డి నగరం ఆధ్వర్యంలో నగర విస్తతస్థాయి కార్యకర్తల సమావేశాన్ని సత్య గార్డెన్లో ఏర్పాటు ...
Read More »రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ నిబంధన ఎత్తివేత
హైదరాబాద్, డిసెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డంకులు తొలగినట్లయింది. రిజిస్ట్రేషన్ అయిన వాటికి తదుపరి రిజిస్ట్రేషన్ కొనసాగించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనుమతులు లేని, క్రమబద్ధీకరణ కాని కొత్త ప్లాట్లకు మాత్రం రిజిస్ట్రేషన్లు చేసేందుకు అనుమతి నిరాకరించింది. అనుమతులు ఉన్న, క్రమబద్ధీకరణ అయిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది.
Read More »డబల్ బెడ్ రూమ్‌ల ఇండ్ల నిర్మాణం పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, డిసెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలో కొత్తగా నిర్మాణం జరుపుకుంటున్న డబుల్ బెడ్ రూమ్‌ల పనులను జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి పరిశీలించారు. మంగళవారం కలెక్టర్ నాగారంలో కొత్తగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, మైనారిటీ పాఠశాల, అదే విధంగా కొత్త కలెక్టరేట్ భవనం నిర్మాణం పనితీరు, అక్కడే నిర్మాణం జరుగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులను పరిశీలించారు. పనులన్నీ మే చివరికల్లా పూర్తిస్థాయిలో నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా కొత్త కలెక్టరేట్ ...
Read More »మొక్కలు సంరక్షించాలి
గాంధారి, డిసెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నర్సరీలలో పెంచుతున్న మొక్కలను సంరక్షించాలని కామారెడ్డి జడ్పీ సీఈఓ చందర్ నాయక్ అన్నారు. మంగళవారం గాంధారి మండలంలో ప్రభుత్వంచే నిర్వహిస్తున్న పలు నర్సరీలను అయన పరిశీలించారు. ఈ సందర్బంగా మండల కేంద్రంలో నర్సరీలో పెంచుతున్న మొక్కలను దగ్గరినుండి పరిశీలించారు. నర్సరీలతో పాటు ఇటీవల హరితహారంలో నాటిన మొక్కలకు ఎప్పటికప్పుడు నీటిని అందించాలన్నారు. నాటిన ప్రతి మొక్క బ్రతకాలన్నారు. ప్రత్యేకంగా నర్సరీలలో పెరుగుతున్న మొక్కలపై శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. అయన వెంట ఎంపీడీఓ ...
Read More »బాధిత కుటుంబానికి కాంగ్రెస్ సాయం
గాంధారి, డిసెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితునికి కాంగ్రెస్ నాయకులు సహాయం అందించారు. గాంధారి మండల కేంద్రానికి చెందిన మద్దెల కాశయ్య ఇల్లు అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న గాంధారి మండల కాంగ్రెస్ నాయకులు తగిన సహాయం అందించారు. బాధితునికి, కుటుంబానికి దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బాలరాజ్, కాంగ్రెస్ నాయకులు మదార్, లైన్ రమేష్, గడ రాజు, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
Read More »ఖాళీ పోస్టులు భర్తీచేయాలి… నిరుద్యోగ భృతి చెల్లించాలి
కామారెడ్డి, డిసెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ యువ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, నిరుద్యోగ భతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమంలో భాగంగా టెక్రియల్ చౌరస్తా వద్ద రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు 22 మంది కార్యకర్తలను అరెస్టు చేసి దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ సందర్భంగా బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల ఆనంతకష్ణ మాట్లాడుతూ ఉద్యోగాలకై కొట్లాడి ...
Read More »30న కిసాన్ మేళా
నిజామాబాద్, డిసెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 30వ తేదీ బుధవారం నాబార్డు వారి సౌజన్యంతో ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధన స్థానం రుద్రూరు నందు కిసాన్ మేళా నిర్వహించనున్నట్టు నాబార్డు డిడిఎం నగేశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కిసాన్ మేళా నందు రైతులకు వరినాటు యంత్రాలు, నేరుగా వరి వెదజల్లే పద్దతి, (డమ్ సీడర్ ద్వారా వరి నాటు పద్దతి తదితర అంశాలపై ప్రదర్శన క్షేత్రాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కె.వి.కె మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర ...
Read More »ఘాట్ రోడ్డు నిర్మాణానికి నిధుల కేటాయింపు
ఆర్మూర్, డిసెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిద్ధులగుట్ట ఘాట్ రోడ్ నిర్మాణానికి నిధుల కేటాయింపునకు అడ్మినిస్ట్రేషన్ క్లియరెన్సు లభించినట్టు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఘాట్ రోడ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సిద్ధులగుట్ట ఘాట్ రోడ్ నిర్మాణానికి 8 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం జీవో జారీచేసిందన్నారు. అసెంబ్లీ సమావేశాలలో జీరో అవర్‌లో సిద్ధులగుట్ట ఘాట్ రోడ్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే, పియుసి ఛైర్మన్ జీవన్ రెడ్డి ప్రస్తావించారు.
Read More »కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
నిజామాబాద్, డిసెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆడబిడ్డల పెళ్లి కానుక కళ్యాణలక్మి లక్ష 16 రూపాయల చెక్కులను 316 మంది లబ్దిదారులకు శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్త మంగళవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
Read More »