Breaking News

Daily Archives: December 2, 2020

శస్త్ర చికిత్సపై విస్తృత అవగాహన

కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం జిల్లా వై ద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో వసేక్టమీ పక్షోత్సవంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అర్హత గల దంపతులకు కుటుంబ నియంత్రణలో పురుషులకు వసేక్టమీ చాలా సులభమయిన విధానమని సూచించారు. ఆరోగ్య సిబ్బంది పురషుల శాశ్వత కుటుంబ నియంత్రణ వసేక్టమి (ఎన్‌ఎస్‌వి) కోత, కట్టు లేని 5 నిమిషాలలో పూర్తవుతుందన్నారు. దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఇద్దరు పిల్లలు గల దంపతులు మగవారు ...

Read More »

కార్పొరేషన్‌ రుణాలకు చివరి అవకాశం

కామరెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌సి కార్పొరేషన్‌ వార్షిక ప్రణాళిక 2018-19 కింద సబ్సిడీ రుణాల కొరకు దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులు బ్యాంకు మరియు మండల పరిషత్‌ అధికారులు, మునిసిపల్‌ కమిషనర్‌ల దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని ఎస్‌సి కార్పొరేషన్‌ కార్య నిర్వాహక సంచాలకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా తమ తమ దరఖాస్తు ఫారాలను ఈనెల 10వ తేదీ వరకు బ్యాంకు సమ్మతితో తమ మండల ప్రజా పరిషత్‌ అధికారి / మునిసిపల్‌ కమిషనర్‌ల ద్వారా ఎస్‌సి ...

Read More »

పల్లె ప్రగతిపై సమీక్ష

కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో 3 లక్షల 53 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ తెలిపారు. బాన్సువాడ, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయాలలో పల్లె ప్రగతిపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు. రూ. 651 కోట్లు ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. దాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా చర్యలు చేపట్టామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ...

Read More »

22 మందికి శస్త్ర చికిత్సలు

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాసెక్టమీ కుటుంబ నియంత్రణకు పురుషులు ముందుకు రావాలని డిఎం హెచ్‌వో సుదర్శనం కోరారు. కుటుంబ నియంత్రణ పక్షోత్సవాలు జరుపుతున్న సందర్భంగా బుధవారం డిచ్‌పల్లిలో 22 మంది పురుషులకు వ్యాసెక్టమీ ఆపరేషన్‌ నిర్వహించినట్లు తెలిపారు. డిసెంబర్‌ 4వ తేదీన బోధన్‌లో నిర్వహిస్తామని తెలిపారు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు స్త్రీల కంటే పురుషులకు సులభమని ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని తెలుపుతూ పురుషులు ముందుకు రావాలని ఆయన కోరారు. స్త్రీలు కూడా మగవారి కుటుంబ ...

Read More »

ఎమ్మెల్యేను పరామర్శించిన సిఎం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గ శాసనసభ్యులు బిగాలా గణేష్‌ గుప్తా, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. శాసనసభ్యులు గణేష్‌ గుప్తా తండ్రి కష్ణమూర్తి గుప్తా గత కొద్ది రోజుల క్రితం ఆకస్మికంగా చనిపోయిన విషయం విదితమే. ఆయన ద్వాదశ దిన కర్మను పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి బుధవారం మాక్లూర్‌లోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి గుప్త సోదరులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కీర్తిశేషులు ...

Read More »

పద్దతి మార్చుకోవాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిజిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నాయకుడు మొహమ్మద్‌ అలీ షబ్బీర్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అద్దంకి దయాకర్‌ పాల్గొని ప్రసంగించారు. దళిత సర్పంచ్‌ రాజుపై సస్పెన్షన్‌ వేటు వేయడం అన్యాయం అని, అభివద్ధి చేస్తున్న సర్పంచ్‌ పై వేటు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్‌ వెంటనే సస్పెన్షన్‌ ఎత్తివేయాలని, ఎమ్మెల్యే చెప్తే విచారణ ...

Read More »