Breaking News

రామారెడ్డిలో కరోన పరీక్షలు – అందరికి నెగిటివ్‌

కామారెడ్డి, డిసెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం రామారెడ్డి ప్రభుత్వ దవాఖాన పరిధిలో గల సబ్‌ సెంటర్‌లో కరోన పరీక్షలు నిర్వహించినారు. రామరెడ్డి గ్రామంలో 89 మందికి, ఇస్సన్నపల్లి గ్రామంలో 58 మందికి, పోసానిపేట్‌ గ్రామంలో 42 మందికి, ఉప్పల్‌ వాయ్‌ గ్రామంలో 41 మందికి, మరియు వడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామంలో 66 మందికి కరోన పరీక్షలు నిర్వహించారని వైద్యాధికారి షాహీద్‌ ఆలి తెలిపారు.

ప్రభుత్వ దవాఖానలో 23 మందికి కరోన పరీక్షలు నిర్వహించారు. మొత్తం 319 మందికి కరోన పరీక్షలు నిర్వహించగా అందరికి కూడా నెగిటివ్‌ వచ్చిందని షాహీద్‌ ఆలి తెలిపారు. క్యాంపులో ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామపెద్దలు, మరియు వైద్య సిబ్బంది భీమ్‌, విమల భారతి, శ్రీహరి, శ్రీధర్‌, జ్యోతి, చంద్రకళ, భువనేశ్వరి, స్వరూపరాణి, గంగవ్వ, పవన్‌, మంజుల, లింబమ్మ మరియు ఆశలు పాల్గొన్నారు.

Check Also

అల‌క్ష్యం చేస్తే చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోళ్లు వేగంగా నిర్వహించాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ...

Comment on the article