Breaking News

ఎదగాలంటే మనసు పెట్టి పనిచేయాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు ప్రభుత్వం సమీకత మత్స్య అభివద్ధి పథకం ద్వారా అందిస్తున్న రివాల్వింగ్‌ ఫండ్‌ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఉద్భోదించారు. గురువారం ప్రగతిభవన్‌లో మత్స్యశాఖ ఏర్పాటుచేసిన రివాల్వింగ్‌ ఫండ్‌ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పాల్గొని రివాల్వింగ్‌ ఫండ్‌ 50 లక్షల రూపాయల చెక్కులను 16 సంఘాలకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం మహిళ మత్స్య పారిశ్రామిక సంఘాలకు అందిస్తున్న ఫండ్‌ సద్వినియోగం చేసుకోవాలని సంఘంలో వందకు ఎక్కువ ఉన్న సభ్యుల సంఘానికి ఐదు లక్షలు వందకు తక్కువ ఉన్న సభ్యుల సంఘాలకు 3 లక్షల చొప్పున పంపిణీ చేశారు. కష్టపడి పని చేస్తే మీరే పది మందికి పని కల్పిస్తారన్నారు. మనం మన కుటుంబం అభివద్ధి చెందాలంటే మనమే కష్టపడాలి అన్నారు.

ప్రభుత్వం నుంచి అందించిన సహాయం నుండి సంఘాలకు ఏ విధంగా ఆదాయం సమకూర్చుకోవాలి ఆలోచన చేస్తూ వ్యాపారం చేస్తూ ముందుకు వెళ్లాలి, ఎదగాలన్నారు. మనిషి ఎదగాలంటే వ్యాపారంలో మనసు పెట్టి పనిచేయాలన్నారు. మొదట కష్టపడ్డ వారే ఈ రోజు పెద్ద పెద్ద స్థాయికి ఎదిగారన్నారు. భగవంతుడు సష్టిలో మనిషికి ఆలోచన శక్తి ఇచ్చాడని, వ్యాపారంలో ఆలోచనతో ముందుకు వెళ్లి పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి రావాలని ప్రభుత్వ ఉద్దేశం అన్నారు.

మహిళ మత్స్యకారులకు వ్యాపారం ప్రారంభం చేయడానికి వీలు కల్పిస్తుందని, ఏ వ్యవస్థ అయినా నిజాయితీగా ఉంటేనే నిలబడుతుందన్నారు. నిజాయితీగా పని చేస్తున్న సంస్థలు ఎదుగుతారని 100 శాతం అభివద్ధి చెందుతాయని సంఘాలలో అభివద్ధి కోసం పనిచేసే వాళ్లను ఎంపిక చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఉచిత చేప పిల్లలు, మోపెడు వాహనాలు అందించిందని తెలిపారు.

ప్రభుత్వం ఇచ్చే డబ్బు సద్వినియోగం చేసుకోవాలని, అందించిన సహాయంతో ఆర్థికంగా ఎదుగుతూ వ్యాపారం చేయాలన్నారు. కార్యక్రమంలో ఇంచార్జ్‌ ఏడి ఫిషరీస్‌ దేవేందర్‌, మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లా కోపరేటివ్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article