Breaking News

Daily Archives: December 8, 2020

బిజెపిలోకి నాచుపల్లి యువకులు

బాన్సువాడ, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నస్రుల్లాబాద్‌ మండలం నాచుపల్లి గ్రామంలో 30 మంది యువకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షురాలు అరుణతార పాల్గొని పార్టీ జండా ఆవిష్కరించారు. అనంతరం యువతను పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీని విస్తరింపజేసి బాన్సువాడ నియోజక వర్గంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ జండా ఎగరవేస్తామని తెలిపారు. కార్యక్రమంలో చిదురా సాయిలు, మండల అధ్యక్షులు హన్మండ్లు యాదవ్‌, ...

Read More »

ఉద్యోగుల వివరాలు అందజేయాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌కు సంబంధించి ప్రయివేటు ఆసుపత్రులు, ల్యాబుల ఉద్యోగుల వివరాల గురించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో మంగళవారం చర్చించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో మంగళవారం డిఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ సుదర్శనం ఆధ్వర్యంలో జిల్లా ఐఎంఎ, తానా అసోసియేషన్‌ కార్యవర్గంతో సమావేశమయ్యారు. ఎవరైనా ప్రయివేటు ఆసుపత్రుల వారు ఉద్యోగుల వివరాలు అందజేయకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సమావేశంలో ఐఎంఎ అధ్యక్షుడు డాక్టర్‌ జీవన్‌రావు, ...

Read More »

డాక్టర్‌ త్రివేణికి లక్ష నగదు పురస్కారం

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయనశాఖకు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.వంగరి త్రివేణి అత్యంత ప్రతిష్టాత్మక రాష్ట్రపతి యువ ప్రోత్సాహ పురస్కారం ”మహర్షి బాదరాయణ వ్యాస్‌ సమ్మాన్‌ – 2019” కి ఎంపికైన విషయం విదితమే. కాగా ఈ సంవత్సరం మార్చి నెలలో న్యూడిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం పొందవలసి ఉండగా కరోనా కారణంగా కొవిద్‌ – 19 లాక్‌ డౌన్‌ నిబంధనలను అనుసరించి పురస్కార మహోత్సవ తేదీలలో మార్పు ...

Read More »

తల్లి జన్మనిస్తే రక్తదాత పునర్జన్మ ఇస్తాడు

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో మంగళవారం కరోణ వారియర్స్‌ 2020 అవార్డుల కార్యక్రమాన్ని కర్షక్‌ బి.ఎడ్‌ కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ రాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో 13 సంవత్సరాల కాలంలో 5 వేల 500 యూనిట్ల రక్తాన్ని మరియు కరోనా సమయంలో 350 యూనిట్ల రక్తాన్ని మరియు 50 యూనిట్ల ప్లాస్మాను సేకరించడం మామూలు విషయం కాదని ఈ ...

Read More »

రైతు నేస్తం పురస్కారానికి జిల్లా రైతు ఎంపిక

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు నేస్తం మాస పత్రిక ద్వారా ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాల ఉండి ఉత్తమ రైతులను, వ్యవసాయ శాస్త్రజ్ఞులను ఎంపిక చేసి అందజేసే రైతు నేస్తం పురస్కారానికి జిల్లా రైతు నాగుల చిన్న గంగారాం (చిన్ని కష్ణుడు) ఎంపికయినట్లు జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జక్రాన్‌పల్లి మండలం చింతలూరు గ్రామానికి చెందిన చిన్ని కష్ణుడు వ్యవసాయాధికారులు సలహాలతో ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా కేవలం ఆర్గానిక్‌ ఎరువులతో ...

Read More »

బంద్‌ కరో… బంద్‌ కరో…

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్త బందులో భాగంగా నిజాంబాద్‌ నగరంలో బైకుల ద్వారా పెద్ద ఎత్తున నిజామాబాద్‌ నగరమంతా తిరుగుతూ దుకాణాలు, వ్యాపార సముదాయాలు బందు చేయించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓ మయ్య మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వస్తుందని దాంట్లో భాగంగానే రైల్వే, బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసి, బ్యాంకింగ్‌, రక్షణ రంగాలను 100 ...

Read More »