Breaking News

మధుయాష్కి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చీరల పంపిణీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రదాత, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా బుధవారం మధుయాష్కీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు, మధుయాష్కీ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ దయాకర్‌ గౌడ్‌ నేతత్వంలో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి, కేశ వేణు, తాహెర్‌బిన్‌ హందాన్‌ ముఖ్య అతిథులుగా హాజరై పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ స్వాతంత్ర తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గొప్ప వ్యక్తి సోనియా గాంధీ అని, అసెంబ్లీ సాక్షిగా సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని చెప్పిన పాలకులు ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీపై అవాకులు చేయడం వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో ఉండి, దేశానికి ఎంతో సేవ చేయాలని కోరుకుంటున్నామని అన్నారు.

కార్యక్రమంలో సినియర్‌ కాంగ్రెస్‌ నాయకులు జాకిర్‌ ఉస్సెన్‌, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు విక్కీ యాదవ్‌, రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రామర్తి గోపి, జిల్లా ఎన్‌ఎస్‌యు అధ్యక్షులు వేణు రాజు, జిల్లా కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర ఎన్‌ఎస్‌యుఐ కార్యదర్శి విపుల్‌ గౌడ్‌, నగర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు సాగర్‌, నూతన నగర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు ప్రీతం, 38 వ డివిజన్‌ కార్పొరేటర్‌ గడుగు రోహిత్‌, నగర ఎస్సీ సెల్‌ అధ్యక్షులు సుభాష్‌ జాదవ్‌, మాజీ కార్పొరేటర్‌ కేశ మహేష్‌, ప్రమోద్‌, శుభం, శోభన్‌, చింటూ మరియు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article