Breaking News

కల్కినగర్‌ నాయకులు బిజెపిలోకి

కామారెడ్డి, డిసెంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కల్కి నగర్‌ 9 వ వార్డుకు సంబంధించిన అధికార తెరాస నాయకులు 21 మంది అధికార పార్టీకి రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డిలో అధికార పార్టీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని, అభివద్ధి మరచి కబ్జాలకు పాల్పడుతున్నారని, వారితో తాళలేక అనేక మంది ఇబ్బంది పడుతున్నారని అన్నారు.

పట్టణంలోని కేవలం 3, 4 వార్డులకు మాత్రమే పరిమితం చేసి ఇతర అధికార పార్టీ కౌన్సిలర్‌ వార్డులను నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. అధికార పార్టీ నాయకుల అండతో కొందరు కల్కినగర్‌లో నాలా కబ్జా చేయటానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. మోదీ రైతులను రాజును చేయాలని చూస్తే కొంత మంది దళారులకు వంత పాడుతూ బిల్లులను రద్దు చేయాలని చూస్తున్నారని, ఎన్ని కుట్రలు చేసిన వ్యవసాయ బిల్లుల విషయంలో బీజేపీ వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article