Breaking News

కేంద్రంలో బీసీ బిల్లు ప్రవేశ పెట్టాలి

ఆర్మూర్‌, డిసెంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశ పెట్టి చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొండవీటి శ్యామ్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం ఆర్మూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు అబ్బగోని అనిల్‌ గౌడ్‌ అధ్య్షతన జరిగిన నిరసన దీక్ష, ధర్నాకు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏ పార్టీ కూడ బీసీని ముఖ్యమంత్రి చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

దామషా ప్రకారం బీసీలకు న్యాయం జరగడం లేదని ఆయన వాపోయారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్‌లలో రిజర్వేషన్‌ కల్పించాలన్నారు. ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగ రిజర్వేషన్‌లపై ఉన్న క్రిమీలేయర్‌ను తొలగించాలన్నారు.

బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలన్నారు. బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 4 లక్షల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేయలన్నారు. కార్యక్రమంలో బీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సెరుపల్లి రాజారాం, విశ్వ బ్రహ్మణ పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు నర్సింహ చారి, ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌, ఎంఆర్‌పిఎస్‌ జిల్లా నాయకులు మంద ప్రభాకర్‌, బీసీ నాయకులు జొరిగే నడిపి గంగాధర్‌, రామారావు, రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

భూ కబ్జాపై విచారణ జరపాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మునిసిపల్‌ లో 9 కోట్ల టిఎండిపి నిధుల‌ ...

Comment on the article