Breaking News

Daily Archives: December 10, 2020

13న జర్నలిస్టుల కుటుంబాలకు ఉచిత కంటి పరీక్షలు

కామారెడ్డి, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఈనెల 13న ఆదివారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నట్టు బాంబే క్లాత్‌ హౌజ్‌, లయన్స్‌ క్లబ్‌, వి.టి.ఠాకూర్‌ పౌండేషన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మద్యాహ్నాం 1 గంట వరకు లయన్స్‌ ఐ హాస్పిటల్‌, గోదాంరోడ్డు, కామారెడ్డిలో కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వబడుతాయని, శస్త్ర చికిత్స అవసరమైన వారికి ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు. అవకాశాన్ని ...

Read More »

12న జాతీయ లోక్‌ అదాలత్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 12న రెండవ శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నామని, అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మరియు ప్రిన్సిపల్‌ జడ్జి సాయి రమాదేవి కోరారు. గురువారం జిల్లా న్యాయ సేవ సర్వీసెస్‌ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సుప్రీం కోర్ట్‌, హైకోర్టు ఆదేశాలను అనుసరించి జాతీయ లోక్‌ అదాలత్‌ ఈ నెల 12న రెండవ శనివారం నిర్వహిస్తున్నామని, 11800 కేసులకు గాను లోక్‌ అదాలత్‌ ద్వారా ...

Read More »

మహిళలు ఆర్థికంగా ఎదిగేలా చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఇంకా ఎస్‌హెచ్‌జి గ్రూపులలో చేరకుండా ఉన్న మహిళలను గుర్తించి వారిని సభ్యులుగా చేర్చి రుణాలు అందించి ఆర్థికంగా ఎదిగిన విధంగా చర్యలు తీసుకోవాలని డిఆర్‌డిఎ అధికారులను జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. గురువారం సంబంధిత అధికారులతో సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో మరో లక్షకి పైగా మహిళలు సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్‌లలో చేరడానికి అవకాశం ఉందని, వారందరినీ గుర్తించి గ్రూపులలో సభ్యులుగా చేర్పించి ...

Read More »

ఉపాధి హామీలో కొనసాగుతున్న పనులన్నీ పక్కాగా జరగాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో నిర్వహిస్తున్న పనులన్నీ పక్కాగా జరిగేలా చూడాలని, గ్రామ కార్యదర్శులు అన్ని రకాల పనులను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు, ఏపీఓలు, డిఆర్‌డిఓ ఇతర అధికారులతో పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ కార్యదర్శులు అర్ధ భాగం విధులు పంచాయతీలకు సంబంధించి ...

Read More »

ఎరువుల సరఫరాకు చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే యాసంగి సీజన్‌ అవసరమైన ఎరువుల సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. గురువారం ప్రగతి భవన్‌ సమావేశం మందిరంలో వ్యవసాయ శాఖ, మార్క్‌ఫెడ్‌ తదితర అధికారులతో యాసంగి సీజన్‌ 2020/21 సన్నాహకము పై జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సొసైటీస్‌ చైర్మన్లు, ఫర్టిలైజర్స్‌ డీలర్స్‌, ట్రేడర్స్‌, కంపెనీ రిప్రజెంట్‌ లతో మాట్లాడుతూ వర్షాలు బాగా పడినందున యాసంగి ...

Read More »

గర్భిణీ స్త్రీలపై కరోనా ప్రభావము-వ్యాధి నిరోధక శక్తి పెరుగుదల

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాస్త్ర సాంకేతిక రంగాలు అభివద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో కొవిడ్‌- 19 కరోనా వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా ప్రభలి గర్బిణీ స్త్రీలపై తీవ్ర ప్రభావం చూపిందని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ఇన్‌ హెల్త్‌, మాలిక్యులార్‌ ఆండ్‌ సెల్‌ బయాలజీ, ముంబాయికి చెందిన ఎమినెంట్‌ శాస్త్రవేత్త డా. దీపక్‌ మోది తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయం వక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ”కొవిడ్‌-19 బేసిక్‌ టు క్లినికల్‌” అనే అంశంపై గురువారం జరిగిన అంతర్జాల ముగింపు ...

Read More »