Breaking News

Daily Archives: December 12, 2020

గ్రామ అవసరాలకు తగినట్టు మొక్కల పెంపకం

కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2020-21 సంవత్సరం నర్సరీల ద్వారా హరితహారంలో నిర్ణయించిన మొక్కల పెంపకం లక్ష్యాన్ని సాధించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివద్ధి శాఖ సెక్రటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా జిల్లా కలెక్టరులకు సూచించారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా హరితహారం, అదనంగా మహిళా స్వయం సహాయక సంఘాల ఏర్పాటు లక్ష్యాలను జిల్లాల వారిగా సమీక్షిస్తూ, ప్రతి గ్రామంలో ఏర్పాటుచేసిన నర్సరీల ద్వారా గ్రామాల అవసరాలకు తగ్గట్టుగా మొక్కల పెంపకం చేపట్టాలని తెలిపారు. మహిళల స్వాలంబనలో ...

Read More »

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజికవర్గంలోని 50 మంది లబ్ధిదారులకు 50.05 లక్షల రూపాయల కల్యాణలక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3 వేల 36 మందికి సుమారు 30 కోట్ల రూపాయల కల్యాణలక్ష్మి, షాదిముభారక్‌ చెక్కులు పంపిణీ చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు.

Read More »

అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అభివద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంభోత్సవాలు చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సుమారు 80 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంభోత్సవాలు చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద పబ్లిక్‌ టాయిలెట్స్‌, మున్సిపల్‌ కార్యాలయంలో 10 చెత్త సేకరించే ఆటోలను, 12, 35 వ వార్డుల్లో సిసి రోడ్లు, మురికి కాలువల ...

Read More »

దొంగ వలన భయం…

కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ మధుసూదన్‌ మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి పట్టణంలో తరచూ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల జరిగిన దొంగతనాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌లు తీసుకోవడం జరిగిందని, అదేవిధంగా ఇటీవల జరిగిన దొంగతనాల్లో ఒకరిద్దరి జోక్యం ఉన్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. ఇకనుంచి కొత్త తరహాలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నామని, ఒక్కో ఏరియాకు ఒక్కో కానిస్టేబుల్‌, హోంగార్డు, ఆఫీసర్‌లను అలర్ట్‌ చేస్తున్నామన్నారు. సంబందిత ఏరియాపై ఇన్‌చార్జి ఆఫీసర్‌ నిరంతర నిఘా ఉంటుందని, తద్వారా ...

Read More »

లక్ష్యానికంటే అదనంగా సిద్దం చేసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరిత హారంలో వచ్చే సంవత్సరాన్ని దష్టిలో పెట్టుకొని నర్సరీలను పెంచుటకు ప్లాన్‌ చేసుకోవాలని పంచాయతీ రాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా కలెక్టర్లకు సూచించారు. శనివారం హైదరాబాద్‌ నుండి చీఫ్‌ కంజర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌, సీఎంఓ ఓఎస్‌డి ప్రియాంక వర్గీస్‌తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో హరితహారంపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 50 శాతం మొక్కలను అదనంగా సిద్ధం చేసుకోవాలని, తద్వారా మొక్కలను కొనే ...

Read More »

కిడ్నీ బాధితుడికి రక్తదానం

కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన దేవేందర్‌ (52) సంవత్సరాల వయసు కలిగిన కిడ్నీ బాధితుడికి చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలలో అవసరం ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. పట్టణానికి చెందిన కిరణ్‌ 41 వ సారి ఓ నెగిటివ్‌ రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. గతంలో చాలాసార్లు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తదానం చేసినందుకు కిరణ్‌ను అభినందించారు. కార్యక్రమంలో టెక్నీషియన్‌ ...

Read More »