Breaking News

Daily Archives: December 13, 2020

ప్రేమ జంట ఆత్మహత్యయత్నం

గాంధారి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓ ప్రేమజంట ఆత్మహత్యయత్నం చేసుకోగా చికిత్స పొందుతూ ప్రియురాలు మతిచెంది, ప్రియుడు చికిత్స పొందుతున్న సంఘటన గాంధారి మండలంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారి మండలం పొతంగల్‌ కలాన్‌కు చెందిన గాండ్ల సాయికుమార్‌ వడ్లూర్‌ గ్రామానికి చెందిన తన మరదలు గాండ్ల రమ్య (19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరని ఈ నెల 11 వ తేదీన శుక్రవారం గాంధారి ...

Read More »

అక్కడ మొత్తం సర్పంచ్‌ భర్త పెత్తనం

గాంధారి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అదో చిన్న గ్రామపంచాయతీ.. అక్కడ వారు దొరలు… ఆ పంచాయతీకి సర్పంచ్‌ జనరల్‌ మహిళా రిజర్వు కావడంతో ఎన్నికలలో దొరల కుటుంబంలోని మహిళ గెలుపొందారు. అప్పటినుండి వారు దొరలు కావడంతో సర్పంచ్‌ భర్త ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. గ్రామ పంచాయతీలో పెత్తనం అంతా ఆయనదే. ఈ విషయమై లోకాయుక్తలో పిర్యాదు వెళ్లగా కేసు నమోదు అయింది.. వివరాల్లోకి వెళితే…. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో తిమ్మాపూర్‌ అనే గ్రామ పంచాయతీ ఉంది. ఈ పంచాయతీకి ...

Read More »

అత్యంత పారదర్శకంగా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే గతి పట్టకుండా, ఏ అధికారికీ విచక్షణాధికారం లేకుండా, అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు – వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ జరగాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. దీనికి అవసరమైన విధి విధానాలు, మార్గదర్శకాలు ఖరారు చేయాలని ఆదేశించారు. వ్యవసాయేతర ఆస్తులు – వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ కోసం అవలంభించాల్సిన పద్ధతులపై అన్ని వర్గాలతో మాట్లాడి, అవసరమైన ...

Read More »

మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం

గాంధారి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని పొతంగల్‌ కలాన్‌ గ్రామంలో ఆదివారం స్థానిక సర్పంచ్‌ బాలరాజ్‌ మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఐడీసీఎంస్‌ ఆధ్వర్యంలో మార్క్‌ఫెడ్‌ ద్వారా రైతుల వద్దనుండి మక్కలను కొనుగోలు చేస్తున్నట్లు అయన తెలిపారు. ముక్కలకు మద్దతు ధర క్వింటాలుకు 1850 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. పంచాయతీ పరిధిలో గల రైతులు వ్యవసాయ శాఖ అధికారుల వద్ద టోకెన్‌లు పొంది కొనుగోలు కేంద్రంలో తాము పండించిన మక్కలను విక్రయించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, ...

Read More »

బిజెపిలో చేరిన పెద్దమల్లారెడ్డి నాయకులు

కామారెడ్డి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం బిక్కనూర్‌ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు, యువకులు భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్‌ కాటిపల్లి వెంకట రమణారెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ సందర్బంగా రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థ ను నిర్వీర్యం చేస్తుందని ఎంపిటిసి, జడ్పీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా చేశారని గత కొన్నేళ్లుగా వారికి నిధులు కేటాయించడం లేదని అన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు కేటాయించిన నిధులు దారి మళ్లించారనే ...

Read More »

అంబానీ, ఆదాని వస్తువులు బహిష్కరించండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్పోరేట్‌ సంస్థలైన రిలయన్స్‌ ముఖేష్‌ అంబానీ, ఆధాని లాంటి గుత్త పెట్టుబడిదారుల వస్తువులను బహిష్కరించాలని ఏఐకెఎమ్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి పి రామకష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో రిలయన్స్‌ షోరూం ముందు జరిగిన ధర్నానుద్దేశించి ప్రభాకర్‌, రామకష్ణ మాట్లాడారు. దేశ సంపదనంతా దోచి కార్పొరేట్లకు, బడా పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టే 3 చట్టాలను, విద్యుత్‌ సవరణ బిల్లును రద్దు చేయాలని గత 17 రోజులుగా ...

Read More »

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

హైదరాబాద్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయ, పోలీసులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తి చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నంటినీ భర్తి చేయాలని, వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల ...

Read More »

16న ‘కట్టడి’ ఆవిష్కరణ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ కవి, రచయిత డాక్టర్‌ కాసర్ల నరేష్‌ రావు రచించిన కరోనా కవితా సంపుటి ‘కట్టడి’ పుస్తకాన్ని 16న ఆవిష్కరించనున్నట్లు హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్‌ తెలిపారు. నగరంలోని కేర్‌ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని కవులు, రచయితలు హాజరు కావాలని కోరారు.

Read More »