Breaking News

అంబానీ, ఆదాని వస్తువులు బహిష్కరించండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్పోరేట్‌ సంస్థలైన రిలయన్స్‌ ముఖేష్‌ అంబానీ, ఆధాని లాంటి గుత్త పెట్టుబడిదారుల వస్తువులను బహిష్కరించాలని ఏఐకెఎమ్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి పి రామకష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో రిలయన్స్‌ షోరూం ముందు జరిగిన ధర్నానుద్దేశించి ప్రభాకర్‌, రామకష్ణ మాట్లాడారు.

దేశ సంపదనంతా దోచి కార్పొరేట్లకు, బడా పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టే 3 చట్టాలను, విద్యుత్‌ సవరణ బిల్లును రద్దు చేయాలని గత 17 రోజులుగా ఢిల్లీ నడిబొడ్డులో లక్షలాది మంది రైతులు ఎముకలు కొరికే చలిలో శాంతియుతంగా ఉద్యమిస్తుంటే రైతుల పైన తీవ్రమైన నిర్బంధం భాష్పవాయువు టియర్‌ గ్యాస్‌ రబ్బరు బుల్లెట్లతో దాడి చేయడం శోచనీయం అన్నారు. దేశ ప్రజలు తీవ్రమైన సంక్షోభం, మరోవైపు కరోనా మహమ్మారి విజంభిస్తున్న సమయంలో రైతాంగాన్ని పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మోడీ చట్టాలను తీసుకు వచ్చి చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతాంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసే కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికలకు ముందు బీజేపీ ప్రణాళికలో రైతాంగానికి పెద్దపీట వేస్తూ తాము అధికారంలోకి వస్తే రైతులకు రెట్టింపు ఆదాయాన్ని కల్పిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చినాక రైతులని లేకుండా చేసే చట్టాలని చేయటం సిగ్గుచేటన్నారు. ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతూ లౌకిక రాజ్యాంగాన్ని అవమానిస్తున్న తీరును ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. అంతర్జాతీయంగా మోడీ ప్రభుత్వానికి ఐక్యరాజ్యసమితి కూడా మొట్టికాయలు వేసిన సిగ్గు, శరం లేదని దుయ్యబట్టారు.

ఇప్పటికైనా రైతులంతా శాంతియుతంగా 3 చట్టాల రద్దుకై చేస్తున్న ఆందోళనను అర్థం చేసుకొని రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని, విద్యుత్‌ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో నీవు మద్దతిస్తున్న కార్పొరేట్‌ సంస్థల యొక్క వస్తు బహిష్కరణ ఉద్యమం ఉధతం అవుతుందని ఫలితంగా ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు.

ధర్నా కార్యక్రమంలో ఏ.ఐ.కె.ఎమ్‌.ఎస్‌ జిల్లా అధ్యక్షులు కే.గంగాధర్‌, ఐ.ఎఫ్‌.టీ.యూ జిల్లా అధ్యక్షులు ముత్తన్న, వెంకన్న, మల్లేష్‌, సాయగౌడ్‌, పి.రాజేశ్వర్‌,పుట్టి నడిపి నాగన్న, సాయాగౌడ్‌, సుధాకర్‌, రమేష్‌, సత్తెక్క, రమా, సూర్య శివాజీ, సాయితేజ, మహిపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article