Breaking News

బిజెపిలో చేరిన పెద్దమల్లారెడ్డి నాయకులు

కామారెడ్డి, డిసెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం బిక్కనూర్‌ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు, యువకులు భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్‌ కాటిపల్లి వెంకట రమణారెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ సందర్బంగా రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థ ను నిర్వీర్యం చేస్తుందని ఎంపిటిసి, జడ్పీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా చేశారని గత కొన్నేళ్లుగా వారికి నిధులు కేటాయించడం లేదని అన్నారు.

గతంలో కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు కేటాయించిన నిధులు దారి మళ్లించారనే ఉద్దేశంతో ఇప్పుడు మోదీ నేరుగా ప్రతి గ్రామానికి 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా ప్రతిపాధికన నెల నెలా గ్రామ ఖాతాల్లో జమ చేస్తున్నారని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయిలో గుత్తేదార్లకు విధులు కేటాయించి నిధులలో వాటాలు కోరుతుందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉపాధి హామీ, 14 వ ఆర్థిక సంఘం నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రైతులకు రైతు బంధు ఇచ్చినట్టే ఇచ్చి నిర్బంద వ్యవసాయం ద్వారా చెప్పిన పంటనే వేయాలని నిండా ముంచారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article