Breaking News

ప్రేమ జంట ఆత్మహత్యయత్నం

గాంధారి, డిసెంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓ ప్రేమజంట ఆత్మహత్యయత్నం చేసుకోగా చికిత్స పొందుతూ ప్రియురాలు మతిచెంది, ప్రియుడు చికిత్స పొందుతున్న సంఘటన గాంధారి మండలంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారి మండలం పొతంగల్‌ కలాన్‌కు చెందిన గాండ్ల సాయికుమార్‌ వడ్లూర్‌ గ్రామానికి చెందిన తన మరదలు గాండ్ల రమ్య (19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరని ఈ నెల 11 వ తేదీన శుక్రవారం గాంధారి మండలం గండివేట్‌ గ్రామ శివారులో ఇద్దరు కలిసి గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని ఎస్‌ఐ తెలిపారు. ఇది తెలిసిన చుట్టూ పక్కల వారు బంధువులకు సమాచారం అందించడంతో వారి బంధువులు వారిని చికిత్స నిమిత్తం వరంగల్‌ ఎంజి ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ప్రియురాలు రమ్య మతిచెందిందని, మతురాలి తండ్రి గాండ్ల రాజు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు.

Check Also

మాతు సంగెంలో కుస్తీ పోటీలు

గాంధారి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని మాతుసంగెం గ్రామంలో సోమవారం కుస్తీపోటీలు నిర్వహించారు. ...

Comment on the article