Breaking News

Daily Archives: December 16, 2020

మంజూరైన చెక్‌డ్యాములు మే వరకు పూర్తిచేయాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాకు మంజూరైన చెక్‌ డ్యాములు మే చివరి నాటికి పూర్తి కావాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశం మందిరంలో ఇరిగేషన్‌ శాఖ అధికారులతో జిల్లాకు మంజూరైన 30 చెక్‌ డ్యాంల ప్రోగ్రెస్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రోగ్రెస్‌లో ఉన్నవి గ్రౌండ్‌ కావాలని మే 30 వరకు పూర్తి కావాలని అన్నారు. ల్యాండ్‌ ఇష్యూ ...

Read More »

క్రిస్మస్‌ అందరి కుటుంబాలలో వెలుగులు నింపాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం స్థానిక రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన క్రిస్మస్‌ పండుగ సందర్బంగా దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డితో కలిసి క్రైస్తవులకు బట్టల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ సమాజంలో ఉన్న పేదవారు సంతోషంగా క్రిస్మస్‌ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా ఇవాళ బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని తెలిపారు. బట్టలు పంచడం ...

Read More »

సాహిత్యం సమాజానికి దివ్య ఔషధం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాహిత్యం సమాజానికి దివ్యమైన ఔషధంగా పని చేస్తుందని, కరోనా సమయంలోనూ నిరూపణ అయిందని ప్రఖ్యాత వైద్యులు డాక్టర్‌ విశాల్‌ అన్నారు. బుధవారం హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్‌ కాసర్ల నరేశ్‌ రావు రచించిన కట్టడి పుస్తక ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మనిషిలోని మానవత్వం ప్రజల చైతన్యం కరోనా వంటి అనేక విపత్తులకు సమాధానం చెప్పగలవని ఆయన వివరించారు. కరోనా సమయంలో సాహిత్యం కూడా ఒక ఔషధంగా ...

Read More »

సామాన్యులపై మోయలేని భారం

బోధన్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రం మరోసారి పెంచిన వంట గ్యాస్‌ ధరలకు నిరసనగా బోధన్‌ పట్టణంలో సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టీబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్‌ సబ్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి మల్లేష్‌ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే, ధరలను పెంచబోమని చెప్పి నేడు పెట్రోల్‌, డిజీల్‌ ధరలతో పాటు అన్నింటి ధరలను పెంచుతూ ప్రజలపై ...

Read More »

తెలంగాణ రైతు సోదరులకు సూచన

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగి 2020 కు గాను మార్గదర్శకాలు విడుదల చేశారు. 1. తేది 10.12.2020 నాటికి ధరణిలో నమోదైన రైతుల వివరాలు సిసిఎఎల్‌ఎ ద్వారా రైతు బంధు పోర్టల్‌ లోకి రావడం జరిగింది. 2. కొత్తగా ఎవరైనా రైతు బంధు కొరకు అకౌంట్‌ ఇవ్వదల్సిన రైతులు 15.12.2020 నుండి 20.12.2020 లోపు మీ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఇవో) కు అప్లికేషన్‌ ఫారం, పట్టాదారు పాస్‌ బుక్‌, ఆధార్‌ మరియు బ్యాంక్‌ అకౌంట్‌ ...

Read More »

ఉద్యోగులు ప్రభుత్వం వేరు కాదు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం వేరు కాదని రెండు కలిస్తేనే ప్రజలకు సేవ చేయగలుగుతామని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర టీఎన్జీవోస్‌ అధ్యక్షునిగా పనిచేసి పదవీ విరమణ చేసిన కారం రవీందర్‌ రెడ్డికి స్థానిక టీఎన్జీవోస్‌ భవన్‌లో సన్మాన కార్యక్రమాన్ని టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ పాజిటివ్‌ దక్పథంతో వెళ్లేవారికి అన్ని అనుకూలంగా ఉంటాయని ఎన్ని ఒత్తిడిలో ఉన్న ...

Read More »

శాస్త్రీయ పరిశోధనలు విస్తరించాలి

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మానవ మనుగడ పురోభివద్ధి సాధించడానికి శాస్త్రీయ పరిశోధనలు విస్తరించాలని అలిగఢ్‌ ముస్లీమ్‌ యూనివర్సిటీకి చెందిన ఆచార్య అల్తాఫ్‌ అహ్మద్‌ తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో వక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్సు ఆన్‌ ”ఎమర్జింగ్‌ ట్రెండ్స్‌ ఇన్‌ లైఫ్‌ సైన్సెస్‌” అనే అంశంపై రెండు రోజుల అంతర్జాల సదస్సు జరిగింది. సదస్సులో ఆయన మాట్లాడుతూ జన్యుశాస్త్రం దాని విస్తరణ, జన్యుయుగం, ప్రోటీయోమిక్స్‌, జీన్‌ రేగులషన్‌ తదితర అంశాలను గూర్చి వివరించారు. అనంతరం ...

Read More »

కల్తీ విత్తనాలపై కఠిన చర్యలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాల్లో ఎక్కడ కూడా కల్తీ విత్తనాలు విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ముందస్తుగా తనిఖీలు నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా నీటి పారుదల సలహా బోర్డు సమావేశం అనంతరం వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతూ డీలర్లు లేదా దుకాణదారులు ఎక్కడ కూడా కల్తీ విత్తనాలు విక్రయించకుండా తనిఖీలు నిర్వహించి ...

Read More »

యాసంగి పంటలకు పూర్తిస్థాయిలో నీటి విడుదల

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కామారెడ్డి ఉమ్మడి జిల్లా పరిధిలో గల ప్రాజెక్టుల కింద గల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో యాసంగికి నీటిని విడుదల చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని రాష్ట్ర రోడ్లు- భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా నీటిపారుదల సలహా బోర్డు సమావేశాన్ని మంత్రి అధ్యక్షతన నిర్వహించారు. రెండు జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు నీటిపారుదల, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు ...

Read More »