Breaking News

సాహిత్యం సమాజానికి దివ్య ఔషధం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాహిత్యం సమాజానికి దివ్యమైన ఔషధంగా పని చేస్తుందని, కరోనా సమయంలోనూ నిరూపణ అయిందని ప్రఖ్యాత వైద్యులు డాక్టర్‌ విశాల్‌ అన్నారు. బుధవారం హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్‌ కాసర్ల నరేశ్‌ రావు రచించిన కట్టడి పుస్తక ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మనిషిలోని మానవత్వం ప్రజల చైతన్యం కరోనా వంటి అనేక విపత్తులకు సమాధానం చెప్పగలవని ఆయన వివరించారు.

కరోనా సమయంలో సాహిత్యం కూడా ఒక ఔషధంగా పని చేసిందని, కవుల రచనలు ప్రజలలో ఆత్మవిశ్వాసం పెంచాయని ఆయన వివరించారు. కరోనా వ్యాక్సిన్‌ వచ్చిన తరువాత అయినా మాస్కులు ధరించడం మానవద్దని మంచి అలవాటుగా కొనసాగించాలని ఆయన కోరారు. వైద్య సేవలో నిజామాబాద్‌ ప్రభుత్వ హాస్పిటల్‌ తెలంగాణలో అగ్రస్థానంలో నిలవడం ఆనందకరమైన విషయమన్నారు.

కరోనా సమయంలో తమ విధినిర్వహణలో భోజన సదుపాయాలు అందించి సహకరించిన తెలంగాణ జాగతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, నిజామాబాద్‌ నగర శాసనసభ్యులు బిగాల గణేష్‌ గుప్తాలకు కతజ్ఞతలు తెలిపారు. హరిదా రచయితల సంఘాన్ని ఆయన అభినందించారు. డాక్టర్లు పోలీసులు పారిశుద్ధ్య కార్మికులు స్వచ్చంద సంస్థలు జర్నలిస్టులు చేసిన సేవలు మరిచిపోలేనివి అన్నారు.

సభకు అధ్యక్షత వహించిన సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్‌ మాట్లాడుతూ కరోనా వారియర్స్‌ చేసిన సేవలు చాలా గొప్పగా సాగాయని మానవత్వం యొక్క విశ్వరూపాన్ని చాటి చెప్పాయని అన్నారు. కరోనా యోధులను సత్కరించడం తమ బాధ్యతగా భావించామని అన్నారు. కరోనా యోధులు కరుణామూర్తులని ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా కరోనా యోధులుగా సత్కారాలు అందుకున్న వారు తమ అనుభవాలను వివరించారు. వలస కార్మికుల బాధలను కళ్లకు కట్టినట్లుగా తెలిపారు. తన అనుభవాలన్నీ కాసర్ల కట్టడి పుస్తకంలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో దశరథ్‌ కొత్మీర్కర్‌, డాక్టర్‌ వి త్రివేణి, గంట్యాల ప్రసాద్‌, తిరుమల శ్రీనివాసార్య, చింతల శ్రీనివాస్‌ గుప్తా, గుత్ప ప్రసాద్‌, చింతల గంగా దాస్‌, డాక్టర్‌ వెంకన్న గారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రత్యేక అవసరాలు గల పిల్ల‌ల‌కు పరికరాల‌ పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల‌ విద్యాశాఖ సంచాల‌కులు తెలంగాణ హైదరాబాద్‌ వారి ఆదేశానుసారం ...

Comment on the article