Breaking News

Daily Archives: December 20, 2020

పశువులకు నట్టల నివారణ మాత్రలు

కామారెడ్డి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం తిమ్మకపల్లి గ్రామంలో విజయడైరీ, జిల్లా పశువర్థక శాఖ మరియు రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గ్రామంలో నట్టల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందులో అవులకు, గేదెలకు, ఎద్దులకు నట్టల నివారణ మాత్రలు వేశారు. అలాగే గోపాల మిత్ర బాబా గౌడ్‌ మాట్లాడుతూ పశువుల యాజమాన్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జ్ఞానేశ్వర్‌, డైరీ అధ్యక్షులు సాయిలు, ఉపాధ్యక్షులు భాస్కర్‌, రిలయన్స్‌ ఫౌండేషన్‌ సిఆర్‌పి వినాయక్‌, గోపాల మిత్ర బాబా గౌడ్‌, ...

Read More »

ఆన్‌లైన్‌లో రుణాలు తీసుకుంటున్నారా.. తస్మాత్‌ జాగ్రత్త!!

హైదరాబాద్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ మధ్యకాలంలో యువత జల్సాలకు అలవాటుపడి ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకొని రుణాలు కట్టలేక వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అనేక రకాల ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా వారికి వచ్చు ఆదాయం కంటే ఎక్కువగా రుణాలు తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న అప్పును తీర్చలేక వారు పెట్టే టార్చర్‌ భరించలేక ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో గానీ లేదా ఏ విధమైన బ్యాంకు నుంచి గాని రుణాలు ...

Read More »

23వ వార్డు వాసులు బిజెపిలోకి

కామారెడ్డి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం కామారెడ్డి పట్టణంలో 23వ వార్డ్‌కు సంబందించిన 30 మంది మహిళలతో సహా 68 మందికి కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ కాటిపాల్లి వెంకటరమణ రెడ్డి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పక్కనున్న సిద్దిపేట, సిరిసిల్ల పట్టణాలు అభివద్ధిలో దూసుకు పోతుంటే కామారెడ్డి పట్టణం మాత్రం అభివద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పట్టణ అభివద్ధికి నిధులు కేటాయిస్తున్నప్పటికీ పట్టణంలో కేవలం మూడు నాలుగు వార్డుల్లో ...

Read More »

ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మేయర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం నగరంలోని నాగారంలోని 300 క్వార్టర్స్‌ ప్రభుత్వ పాఠశాలలో లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ డైమండ్‌ నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జితేశ్‌.వి.పాటిల్‌ హాజరయ్యారు. ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని ఉద్దేశిస్తూ మేయర్‌ మాట్లాడుతూ లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ నిజామాబాద్‌ డైమండ్‌ వారు పేద ప్రజల ఆరోగ్యం విషయమై హెల్త్‌ క్యాంప్‌ ఏర్పాటు చేయటం ...

Read More »

జాగృతిని గ్రామస్థాయికి తీసుకెళ్ళాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా తెలంగాణ జాగతి విస్తత స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కర్షక్‌ బీఈడి కళాశాలలో జాగతి జిల్లా అధ్యక్షులు చిట్టిమల్ల అనంత రాములు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి జిల్లా నలు మూలలనుండి తెలంగాణ జాగతి కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాగతి అధ్యక్షులు మాట్లాడుతూ జాగతిచే నిర్వహించే విద్య, వైద్య, సాంస్కతిక, సాహిత్య, మహిళా సాధికారిక లాంటి కార్యక్రమాలను మండల, గ్రామ స్థాయిలో తీసుకెళ్లడానికి సభ్యులు కషిచేయాలని సూచించారు. ...

Read More »

రైతుల సంతాప సభ

బోధన్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం దేశ వ్యాప్తంగా రైతు అమరుల సంతాప దినం జరుపాలని ఏఐకేఎస్‌సిసి ఇచ్చిన పిలుపు మేరకు బోధన్‌ పట్టణం పాన్‌గల్లి పోచమ్మ గుడి వద్ద సంతాప సభ నిర్వహించారు. ఏఐకేఎస్‌సిసి నాయకులు గంగాధరప్ప, బి.మల్లేష్‌, వరదయ్య, జే.శంకర్‌గౌడ్‌, పడాల శంకర్‌తో పాటు బొంతల సాయులు, సీ.హెచ్‌.గంగయ్య, పడాల ఈరయ్య, బొయిడి నాగయ్య, ఎస్‌ కే మైబూబ్‌, కందికట్ల నారాయణ, పార్వతి, లక్ష్మి, సాయవ్వ, లలిత తదితరులు పాల్గొన్నారు.

Read More »