Breaking News

23వ వార్డు వాసులు బిజెపిలోకి

కామారెడ్డి, డిసెంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం కామారెడ్డి పట్టణంలో 23వ వార్డ్‌కు సంబందించిన 30 మంది మహిళలతో సహా 68 మందికి కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ కాటిపాల్లి వెంకటరమణ రెడ్డి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పక్కనున్న సిద్దిపేట, సిరిసిల్ల పట్టణాలు అభివద్ధిలో దూసుకు పోతుంటే కామారెడ్డి పట్టణం మాత్రం అభివద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం పట్టణ అభివద్ధికి నిధులు కేటాయిస్తున్నప్పటికీ పట్టణంలో కేవలం మూడు నాలుగు వార్డుల్లో మాత్రమే అభివద్ధి జరుగుతుందని మిగిలిన వార్డులను గాలికి వొదిలేసారని అన్నారు. ఈ సందర్భంగా మహిళలు 23 వ వార్డు పరిధిలో తడి చెత్త, పొడి చెత్త వేయటానికి డబ్బాలు ఇవ్వలేదని చెప్పగా బీజేపీ కౌన్సిలర్‌ల ద్వారా కమిషనర్‌ దష్టికి తీసుకెళ్తామని అన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article