డిచ్పల్లి, డిసెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో పీజీ కోర్సులకు సంబంధించిన నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్లాగ్ మరియు మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలు జనవరి 5 వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నాయి. అందుకోసం విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు డా. వాసం చంద్రశేఖర్ విభాగాధిపతులతో మంగళవారం ఉదయం పరిపాలనా భవనంలోని ఎగ్జిక్యూటీవ్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించి, పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
ఎం.సి.ఎ., ఎల్.ఎల్.బి., 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలు, ఎం.ఎ., ఎం.ఎస్సీ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎల్.ఎల్.ఎం. రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలు, ఎం.సి.ఎ., ఎల్.ఎల్.బి., 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ అండ్ బ్యాక్ లాగ్ పరీక్షలు, ఎం.ఎ., ఎం.ఎస్సీ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎల్.ఎల్.ఎం., ఎం.సి.ఎ., ఎల్.ఎల్.బి., 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలు, జనవరి 5 వ తేదీ నుంచి 19 వ తేదీ వరకు జరుగనున్నట్లుగా రిజిస్ట్రార్ ఆచార్య నసీం నిర్ణయించిన మేరకు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు షెడ్యూల్ విడుదల చేశారు.
కావున ఈ విషయాన్ని అనుబంధ పీజీ కళాశాలల ప్రధానాచార్యులు మరియు విద్యార్థులు గమనించాలన్నారు. పరీక్షల పూర్తి వివరాలకోసం విశ్వవిద్యాలయ వెబ్ సైట్ను సంప్రదించాలన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021