Breaking News

Daily Archives: December 24, 2020

ఈ లక్షణాలుంటే వెంటనే టెస్టు చేయించుకోండి…

హైదరాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్రిటన్‌లో పుట్టిన కొత్త రకం కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. బ్రిటన్‌ నుంచి వచ్చే, అక్కడకు వెళ్లే విమానాలన్నింటినీ చాలా దేశాలు రద్దు చేశాయి. దాని ప్రభావంతో చాలా ప్రాంతాల్లో పాక్షికంగా లాక్‌డౌన్లు పెట్టేస్తున్నారు. ఇండియాలోనూ కర్ణాటక, మహారాష్ట్రల్లోని కొన్ని సిటీల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. ప్రస్తుతం ఈ రకం కరోనాను గుర్తించడానికి నిర్దిష్టమైన టెస్టుల్లేవు. ఆర్టీపీసీఆర్‌ టెస్టులే చేసి పాజిటివ్‌ వస్తే దాని జన్యు క్రమాన్ని తేల్చే పనిలో పడ్డారు ...

Read More »

36 మంది లబ్ది దారులకు చెక్కుల పంపిణీ

బాన్సువాడ, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం బాన్సువాడ మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఎస్‌.సి, ఎస్‌.టిలోని 36 మంది లబ్ధిదారులకు రూపాయలు 20 లక్షల 2 వేల 320 ల చెక్కులను ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నీరజ వెంకట్‌ రామ్‌ రెడ్డి, జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, ఎంపీడీఓ యావర్‌ హుస్సేన్‌ సూఫీ, ఎమ్‌ఆర్‌ఓ గంగాధర్‌, మండల సర్పంచుల సమాఖ్య ...

Read More »

కిసాన్‌ సమ్మాన్‌ యోజనలో లక్ష 50 వేల మంది కామారెడ్డి రైతులకు లబ్ది

కామారెడ్డి, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌ పేయి జయంతి (సుపరిపాలన దినోత్సవం) సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా యసంగి పంట కోసం 9 కోట్ల మంది రైతులకు కిసాన్‌ సమ్మన్‌ యోజన కింద 18 వేల కోట్ల రూపాయలు నేరుగా జమ చేయనున్నారని, అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో దాదాపు ఒక లక్ష యాబై ఒక్క వేల మంది రైతులకు లబ్ది చేకూరుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు ...

Read More »

క్రిస్టియన్‌లకు మంత్రి క్రిస్మస్‌ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లా క్రిస్టియన్‌ సోదర, సోదరీమణులకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని, ఆయన చెప్పిన ప్రేమ, కరుణ, శాంతి అనే సుగుణాలను పాటిస్తే అందరి జీవితాలు సుఖశాంతులతో ఉంటాయన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వ కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ప్రజలు సంతోషంగా క్రిస్మస్‌ పండుగను జరుపుకోవాలని మంత్రి వేముల కోరారు.

Read More »

కాలనీల అభివృద్ధికి అందరూ కృషి చేయాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాలనీల అభివద్ధికి అందరూ కలిసి కషి చేయాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. గురువారం ఆయన నగరంలో ఆకస్మికంగా పట్టణ ప్రగతి పనులను, ప్రకతి వనాలను, నర్సరీలను పర్యటించి పరిశీలించారు. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో జరుగుతున్న పట్టణ ప్రగతి పనులలో భాగంగా సుభాష్‌ నగర్‌, ఓల్డ్‌ ఎన్జీవోస్‌ కాలనీ, ఖిల్లా రఘునాథ్‌ చెరువు కట్టపై నిర్మాణంలో ఉన్న వాకింగ్‌ ట్రాక్‌ పనులను, నర్సరీని, న్యాల్కల్‌ రోడ్డులో గల నర్సరీనీ పరిశీలించారు. ...

Read More »

శుక్రవారం మంత్రులచే పలు ప్రారంభోత్సవాలు

కామారెడ్డి, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యవసాయ శాఖ, కోఆపరేటివ్‌, మార్కెటింగ్‌ శాఖల మంత్రి ఎస్‌.నిరంజన్‌ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభా వ్యవహారాలు, గహనిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంతరెడ్డి శుక్రవారం 25 తేదీన జిల్లాలో వివిధ అభివద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్నట్లు జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం పది గంటలకు భికనూర్‌ మండలం బస్వాపూర్‌ గ్రామంలో రైతు వేదిక ప్రారంభోత్సవం, ఇతర కార్యకమాలు, మధ్యాహ్నం 12 గంటలకు బికనూర్‌ మండల కేంద్రంలో ...

Read More »

5 లక్షల చెక్‌ అందజేసిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరంట్‌ షాక్‌తో మతి చెందిన కామారెడ్డి మండలం చిన్న మాల్లారెడ్డి గ్రామానికి చెందిన నెలూరి రంజిత్‌ కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ గురువారం అందజేశారు. రంజిత్‌ మతి చెందగా ఆయన తండ్రి యాదగిరికి ట్రాన్స్‌కో ద్వారా మంజూరైన చెక్కును అందజేశారు.

Read More »

జనవరి 3న సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు

ఆర్మూర్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనవరి 3న ఆర్మూర్‌లో జరిగే దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే రాష్ట్ర స్థాయి జయంతి వేడుకల పోస్టర్ల ను ఆర్మూర్‌ ప్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు ఆవిష్కరించారు. కార్యక్రమానికి గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మిబాయి హాజరువుతున్నట్లు చెప్పారు. ఆర్మూర్‌ డివిజన్‌ ప్రజలంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఆర్మూర్‌ న్యూ నిమ్మల గార్డెన్‌లో కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో స్వేరోస్‌ జిల్లా అధ్యక్షులు సాయి, ...

Read More »

శుక్రవారం ఇందూరు తిరుమల ఆలయంలో వైకుంఠ ఏకాదశి

మోపాల్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇందూరు తిరుమల ఆలయంలో స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనంతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని మా పల్లె చారిటబుల్‌ ట్రస్టు నర్సింగ్‌పల్లి వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజామాబాద్‌ గాయకుల చేత సంగీత కచేరి ఉదయం నుండి ప్రారంభమవుతుందని, ఉదయం 8 గంటలకు ఆలయంలో రెండు ఆవిష్కరణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమాలకు ప్రముఖ సినీ నిర్మాత మరియు ఆలయ ట్రస్టు చైర్మన్‌ ...

Read More »

క్రిస్మస్‌ బట్టలు పంపిణీ చేసిన మేయర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాగారంలోని విక్టరీ అసెంబ్లీ ఆఫ్‌ గాడ్‌ చర్చ్‌లో ఏర్పాటు చేసిన క్రిస్మస్‌ వేడుకల్లో నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ పాల్గొన్నారు. క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా నాగరంలోని 80 క్వార్టర్స్‌ చర్చ్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని పేదలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న క్రిస్మస్‌ కానుక బట్టలు పంపిణీ చేసి కేక్‌ కట్‌ చేసి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

గ్రామ పంచాయతీ భవనానికి భూమిపూజ

బాన్సువాడ, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండలం హంగర్గఫారం గ్రామంలో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి గురువారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. హాంగర్గ ఫారం గ్రామంలో నూతనంగా రూ. 20 లక్షల నిధులతో నిర్మించనున్న గ్రామ పంచాయితీ భవనానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెరాస పార్టీ నాయకులు పోచారం సురేందర్‌ రెడ్డితో కలిసి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి భూమి ...

Read More »

రైతు సేవా కేంద్రం ప్రారంభం

బాన్సువాడ, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండల హెగ్డోలి గ్రామంలో నూతనంగా స్థాపించిన ”ఆగ్రోస్‌ రైతు సేవాకేంద్రం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెరాస పార్టీ నాయకులు పోచారం సురేందర్‌ రెడ్డితో కలిసి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి పాల్గొని సేవాకేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ అగ్రికల్చర్‌ డిఏఓ గోవిందు, ఏఓ, సర్పంచ్‌ వెంకా గౌడ్‌, ఎంపీపీ సునీత శ్రీనివాస్‌, జడ్పీటీసీ శంకర్‌ పటేల్‌, కోటగిరి మండల పార్టీ అధ్యక్షులు ఎజాజ్‌ ఖాన్‌, ...

Read More »