Breaking News

శ్రీనివాసుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

బాన్సువాడ, డిసెంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైకుంఠ ఏకాదశి సందర్బంగా తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో తెరాస పార్టీ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్బంగా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామంలోని చిన్న తిరుమల తిరుపతి దేవస్థానం నందు ఉత్తర ముఖ ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకున్నారు.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని అశీసులు ప్రజలందరిపైన ఎల్లప్పుడు ఉండాలని, కరోనా మహమ్మారి నుండి రాష్ట్ర, దేశ ప్రజలను కాపాడాలని వైకుంఠ నాధుడిని కోరుకుంటున్నానన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో బీర్కూరు ఎంపీపీ రఘు, నాగేశ్వరరావు, అప్పారావు, వెంకట్‌ రామ్‌ రెడ్డి శశి, అవారి గంగారాం, వీరేశం, సత్యనారాయణ, బాన్సువాడ ఏఎంసి చైర్మన్‌ పాత బాలకష్ణ, బీర్కూరు మండల ఎంపీటీసీలు, సర్పంచులు, భక్తులు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి పనులు పరిశీలించిన స్పీకర్‌

బాన్సువాడ, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న అభివద్ధి పనులను ప్రజాప్రతినిధులు, అధికారులతో ...

Comment on the article