Breaking News

దోపిడీ దొంగల అరెస్టు

కోరుట్ల, డిసెంబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేడిపల్లిలో గత మూడు రోజుల క్రితం జరిగిన ఒక దోపిడీ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి పదిహేను తులాల బంగారం, మూడు సెల్‌ ఫోన్స్‌, ఒక మోటార్‌ బైక్‌, 7 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సదరు నిందితులు సారంగాపూర్‌, ధర్మపురి, జగిత్యాల మొదలగు ప్రదేశాలలో 8 దోపిడీలకు పాల్పడుతున్నారు.

వీరిలో ఒక ఆడ మనిషి మగ వారిని ఆకర్షించి ఎవరు లేని ప్రదేశాలలోకి తీసుకు వెళ్ళగా మిగతా నిందితులు వారిపై దాడి చేసి, వారిని దోచుకోవటం గత రెండు నెలల నుంచి జరుగుతుంది. నిందితులను అరెస్టు చేసిన కోరుట్ల సీఐ రాజశేఖర రాజు, మేడిపల్లి ఎస్సై సుధీర్‌ రావు, కోరుట్ల ఎస్‌ఐ రాజ ప్రమీల, సిబ్బంది రవి, వీరన్న, అజీస్‌, చిరంజీవి, విజయ్‌, పండరి, ధర్మయ్య మరియు శ్యామలను జిల్లా ఎస్‌పి సింధు శర్మ ప్రత్యేకంగా అభినందించారు.

Check Also

పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ ఐపిఎస్‌ కార్తికేయ సమాచారం మేరకు ...

Comment on the article