Breaking News

బండి సంజయ్‌కు మంత్రి సవాల్‌

ఎల్లారెడ్డి, డిసెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో స్థానిక శాసన సభ్యులు జాజాల సురేందర్‌తో కలిసి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పలు అభివద్ధి పనుల శంకుస్థాపన, భూమిపూజ, ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్లారెడ్డి చెరువు కట్టపై 3.56 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించే రోడ్‌ శంకుస్థాపనతో పాటు 5 కోట్లతో నిర్మించే బ్రిడ్జి నిర్మాణ పనుల శంకుస్థాపన మరియు భూమిపూజ నిర్వహించారు.

ఎల్లారెడ్డి పట్టణంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణ పనుల భూమిపూజ కార్యక్రమం అనంతరం ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో నిర్మించిన నూతన ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ (అధికారిక భవనం) ను స్థానిక ఎమ్మెల్యే, జడ్పీ చైర్‌ పర్సన్‌ దాఫెదార్‌ శోభరాజు, జిల్లా కలెక్టర్‌ శరత్‌, పలువురు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి వేముల ప్రారంభించారు. అనంతరం ఎల్లారెడ్డి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ ఆధ్వర్యంలో అభివద్ధి చెందుతుందన్నారు.

నియోజకవర్గ అభివద్ధి కోసం తన వంతు సహకారం తప్పకుండా ఉంటుందన్నారు. ఆర్‌అండ్‌బి శాఖ తరుపున మరికొన్ని నూతన రోడ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. బాల్కొండ నియోజకవర్గం తనకు ఎంత ఇష్టమో ఎల్లారెడ్డి నియోజకవర్గం అంత ఇష్టమని, స్థానిక ఎమ్మెల్యే సురేందర్‌తో కలిసి నియోజకవర్గ అభివద్ధికి ప్రత్యేకంగా కషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు, ప్రజా సమస్యలు సత్వర పరిష్కారాల కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు నిర్మించారన్నారు. ఇటీవల కొంతమంది కేసీఆర్‌ ప్రభుత్వం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు. రైతు బంధు, రైతు భీమా, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌, మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్లు, కళ్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, 2016 రూ. ఆసరా పెన్షన్‌ లాంటివి బీజేపీ అధికారంలో ఉన్న 12 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఇస్తున్నారా అని అన్నారు. బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు.

కేసీఆర్‌ ప్రభుత్వం కంటే మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్క మెరుగైన సంక్షేమ పథకం చూపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సవాల్‌ విసిరారు. నిత్యం అబద్ధాలు ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకుల్ని ఈ విషయంపై ప్రజలు ప్రశ్నించాలన్నారు. సోషల్‌ మీడియాను అడ్డం పెట్టుకొని అబద్ధాలను నిజం చేయాలనుకుంటున్నారని, పాలు-నీళ్లు వేరు చేసినట్లు బీజేపీ అబద్ధాలు ప్రజల ముందుంచుతామన్నారు.

ప్రజలు అబద్ధాలు, నిజాలు గుర్తిస్తున్నారని మీకు సరైన సమయంలో సమాధానం చెప్తారన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం నిరంతరం ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుందని మంత్రి పునరుద్ఘాటించారు.

Check Also

వెనకబడిన ప్రాంతాల‌ను గుర్తించి అభివృద్ధి చేయాలి

ఎల్లారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అందరి సహకారంతో ఎల్లారెడ్డి పట్టణాన్ని ఆరోగ్య పట్టణంగా తీర్చిదిద్దాల‌ని ...

Comment on the article