కామారెడ్డి, డిసెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంతోమంది కరసేవకుల త్యాగము, కషి ఫలితంగా శతాబ్దాల అనంతరం హిందువుల ఆరాధ్య దైవం అయిన భగవాన్ శ్రీ రాముని భవ్య మందిర నిర్మాణం రాజ్యాంగబద్ధంగా ప్రారంభమైందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దక్షిణ మధ్య క్షేత్ర ధర్మ జాగరణ ప్రముఖ్ అమర లింగన్న అన్నారు.
శ్రీరామ భవ్యమందిర నిర్మాణ నేపథ్యంలో శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కామారెడ్డి నగరం ఆధ్వర్యంలో నగర విస్తతస్థాయి కార్యకర్తల సమావేశాన్ని సత్య గార్డెన్లో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అమర లింగన్న మాట్లాడారు. మందిర నిర్మాణంలో సమస్త హిందూ ప్రజానీకాన్ని భాగస్వామ్యం చేయుటకై జనవరి 20వ తేదీ నుండి ఫిబ్రవరి 10 వరకు శ్రీ రామ మందిర నిర్మాణ నిధి సేకరణ ఉద్యమంలో భాగంగా జన జాగరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఇందులో భాగంగా నగర వ్యాప్తంగా రెండు వేల మంది కార్యకర్తలతో 30 వేల హిందూ కుటుంబాలను కలిసి మందిర నిర్మాణ ఆవశ్యకతను వివరిస్తూ జన జాగరణ నిర్వహిస్తామని, సమర్పణ పేరిట మందిరానికి విరాళాలు సేకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్ బొడ్డు శంకర్, జిల్లా సంయోజక్ పాపయ్య గారి గోవర్ధన్, స్వయం సేవకులు వివిధ క్షేత్ర కార్యకర్తలు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- బోధన్ ప్రాంత ప్రజలు అలర్ట్ - April 19, 2021
- రెండు రోజుల్లో ఇద్దరి మృతి - April 19, 2021
- ఎక్కడివక్కడే… ఏమిటివి… - April 19, 2021