Breaking News

30న కిసాన్‌ మేళా

నిజామాబాద్‌, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 30వ తేదీ బుధవారం నాబార్డు వారి సౌజన్యంతో ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధన స్థానం రుద్రూరు నందు కిసాన్‌ మేళా నిర్వహించనున్నట్టు నాబార్డు డిడిఎం నగేశ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కిసాన్‌ మేళా నందు రైతులకు వరినాటు యంత్రాలు, నేరుగా వరి వెదజల్లే పద్దతి, (డమ్‌ సీడర్‌ ద్వారా వరి నాటు పద్దతి తదితర అంశాలపై ప్రదర్శన క్షేత్రాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కె.వి.కె మరియు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలచే సాంకేతిక పరిజ్ఞానం మరియు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రజాప్రతినిధులు, రైతు బందు సభ్యులు హాజరుకావాలని సూచించారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article