Breaking News

Daily Archives: December 30, 2020

కలెక్టర్‌, ఎమ్మెల్యేదే బాధ్యత

కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డిగ్రీ కళాశాల భూములకు సంబంధించిన సర్వేను సర్వేయర్లు అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడి సక్రమంగా చేయడం లేదని, ఆక్రమణలకు గురైన ప్రాంతంలోని భూముల సర్వేను సర్వేయర్లు చేయడం లేదని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం అన్నారు. వారం రోజుల క్రితం భూముల సర్వేకు సంబంధించి ఏర్పాటు చేసిన హద్దులను గుర్తుతెలియని వ్యక్తులు తొలగించడం జరిగిందని వెంటనే జిల్లా కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ చొరవ తీసుకుని ...

Read More »

జిల్లా కలెక్టర్‌కు డిజిటల్‌ ఇండియా 2020 అవార్డు

కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిజిటల్‌ ఇండియా 2020 అవార్డును భారత రాష్ట్రపతి నుండి కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అందుకున్నారు. బుధవారం ఉదయం కొత్త ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో వర్చువల్‌ పద్ధతిలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా డిజిటల్‌ ఇండియా 2020 అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఎక్సలెన్స్‌ ఇన్‌ డిజిటల్‌ గవర్నెన్స్‌ డిస్ట్రిక్ట్‌ క్యాటగిరిలో సిల్వర్‌ అవార్డును భారత రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ నుండి జిల్లా కలెక్టర్‌ అందుకున్నారు. జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా ...

Read More »

రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తహసిల్దార్లు సమస్యలు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం ప్రగతి భవన్‌లో తహసీల్దార్లు, ఆర్‌అండ్‌బి ఏఇలతో డబుల్‌ బెడ్‌ రూమ్స్‌ ఇళ్లు, ధరణిపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళ నిర్మాణాలకు ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తున్నదని కావున తొందరగా పూర్తి కావాలని, గత సంవత్సరం కరోన వలన ...

Read More »

న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసుశాఖ హెచ్చరికలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబర్‌ 31న రాత్రి ప్రజలు వ్యవహరించాల్సిన తీరుపై నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తికేయ పలు సూచనలు చేశారు. కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌ పరిధిలోని అన్ని ప్రాంతాలలో డిసెంబర్‌ 31న రాత్రి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే సందర్భంగా కమీషనరేటు పరిధిలోని వైన్స్‌, కల్లు దుకాణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి పొందిన సమయం వరకే మధ్యం విక్రయించాలన్నారు. అలా కాకుండా ప్రభుత్వం నుండి అనుమతి పొందిన సమయం దాటిన ...

Read More »

కేజివీల్స్‌ రోడ్లపై తిప్పడం చట్టరీత్యా నేరం

ఆర్మూర్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వాలు ప్రజల అవసరాల కోసం నిర్మించిన ప్రజా ప్రభుత్వ రోడ్లపై వ్యవసాయ భూములు దున్నడం కోసం ట్రాక్టర్‌ ఓనర్లు కేజివీల్స్‌ తో తిప్పడం వల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయని, కావున ప్రజా, ప్రభుత్వ ఆస్తులైన రోడ్లు ధ్వంసం చేయడం చట్టరీత్యా నేరమని ఏర్గట్ల మండల కేజివీల్‌ ట్రాక్టర్స్‌ యజమానులకు ఏర్గట్ల పోలీస్‌ వారు సూచించారు. కేజివీల్‌ ట్రాక్టర్స్‌ని సీజ్‌ చేసి కేసు నమోదు చేయబడుతుందని, రోడ్లు డ్యామేజ్‌ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ...

Read More »

సీనియర్‌ సిటిజన్స్‌ కొరకు హెల్ప్‌లైన్‌ 14567

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీనియర్‌ సిటిజన్స్‌కు అవసరమైన సహాయం అందించడానికి హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 14567 కు కాల్‌ చేయవచ్చని జిల్లా వెల్ఫేర్‌ అధికారి ఝాన్సీ లక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. సలహాలు, సూచనలు, పెన్షన్లు చట్టపరమైన సూచనలు, న్యాయపరమైన సలహాలు వద్ధాప్య గహాలు కౌన్సిలింగ్‌ మరెన్నో విషయాన్ని తెలియజేయడానికి కిట్‌, టోల్‌ ఫ్రీ నెంబర్‌ వయో వద్ధులు ఉపయోగించుకోవాలని ఆమె ప్రకటనలో కోరారు.

Read More »

వ్యవసాయంలో యంత్రాల ఉపయోగంపై అవగాహన కలిగి ఉండాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కూలీల కొరతతో పాటు ఖర్చులు తగ్గించుకోవడానికి యంత్రాలు ఉపయోగం వల్ల రైతులకు పలు రకాలుగా ప్రయోజనాలు కలిగి ఉన్నందున వ్యవసాయ పనులకు యంత్రాల వాడకంపై రైతులు అవగాహన ఏర్పర్చుకొని ఆ దిశగా ఆలోచించాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సూచించారు. కూలీల కొరత ఏర్పడటంతో పాటు కూలి ఖర్చులు కూడా పెరగడం తద్వారా వ్యవసాయానికి ఖర్చులు పెరగడం, రైతులకు ఇబ్బందులు ఎదురు కావడం ఇతర విషయాలను దష్టిలో పెట్టుకొని యంత్రాలు ఉపయోగంపై ...

Read More »