Breaking News

వ్యవసాయంలో యంత్రాల ఉపయోగంపై అవగాహన కలిగి ఉండాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కూలీల కొరతతో పాటు ఖర్చులు తగ్గించుకోవడానికి యంత్రాలు ఉపయోగం వల్ల రైతులకు పలు రకాలుగా ప్రయోజనాలు కలిగి ఉన్నందున వ్యవసాయ పనులకు యంత్రాల వాడకంపై రైతులు అవగాహన ఏర్పర్చుకొని ఆ దిశగా ఆలోచించాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సూచించారు.

కూలీల కొరత ఏర్పడటంతో పాటు కూలి ఖర్చులు కూడా పెరగడం తద్వారా వ్యవసాయానికి ఖర్చులు పెరగడం, రైతులకు ఇబ్బందులు ఎదురు కావడం ఇతర విషయాలను దష్టిలో పెట్టుకొని యంత్రాలు ఉపయోగంపై ఆలోచించడం మంచిదని, ఈ విషయాన్ని దష్టిలో పెట్టుకొని రైతులకు వరి నాటు, డ్రమ్‌ సీడర్‌తో విత్తనాలు వెదజల్లడం, వరి కోత, చెరకు కోత, కలుపు తీయడం తదితర పనులకు యంత్రాల ద్వారా ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలో రైతులకు అవగాహన కల్పించడానికి బుధవారం రుద్రూర్‌ కషి విజ్ఞాన కేంద్రంలో నాబార్డ్‌ సౌజన్యంతో అవగాహన కార్యక్రమాన్ని రైతు సదస్సును ఏర్పాటు చేశారు.

పలు కంపెనీలకు సంబంధించిన వ్యవసాయ సంబంధిత యంత్రాలను ప్రదర్శించి మహేంద్ర యాన్మార్‌, కుబోటో కంపెనీల యంత్రాలు, ప్రతినిధులు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సైంటిస్ట్‌లచే పనితీరు తదితర విషయాలపై రైతులకు నేరుగా అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. యంత్రాల ఉపయోగంతో పాటు మట్టి నమూనాలు పంటల సాగు ఏ మట్టిలో ఏ పంటలు వేస్తే రైతుకు లాభకరంగా ఉంటుందో శాస్త్రవేత్తలు వివరించారు.

అదేవిధంగా అధిక దిగుబడికి ఏం చేయాలో తెలిపారు. ఎరువులు, పురుగు మందుల వాడకంతో పాటు అధిక దిగుబడులకు తీసుకోవాల్సిన చర్యలపై వివరంగా తెలిపారు. కార్యక్రమాల్లో భాగంగా స్టాల్స్‌ కూడా ఏర్పాటు చేసి రైతులకు పలు విషయాలపై సందేహాలను నివత్తి చేశారు. కార్యక్రమాల్లో జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, నాబార్డ్‌ డిడిఎం నగేష్‌, వ్యవసాయ శాస్త్రవేత్తలు శ్రీధర్‌, స్వామి, నవీన్‌ కుమార్‌, వాసుదేవరావు, రైతులు, బోధన్‌ ఆర్‌.డి.ఓ. రాజేశ్వర్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రత్యేక అవసరాలు గల పిల్ల‌ల‌కు పరికరాల‌ పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల‌ విద్యాశాఖ సంచాల‌కులు తెలంగాణ హైదరాబాద్‌ వారి ఆదేశానుసారం ...

Comment on the article