Breaking News

ఎరువుల సమస్య లేదు

నిజామాబాద్‌, జనవరి 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఎరువుల నిల్వలు సరిపోయినంతగా ఉన్నాయని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. శనివారం తన చాంబర్‌లో యాసంగి పంట కాలానికి సంబంధించి ఎరువులు, విత్తనాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాకు రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చి కావలసిన ఎరువులను తెప్పిస్తున్నారనీ అన్నారు.

జిల్లా యంత్రాంగం జనవరి నెలకు కావలసిన ఎరువులు ఇప్పటికె తెప్పించి ఉంచడం జరిగిందని తెలిపారు. ట్రేడర్స్‌ దగ్గర స్టాకు 33.270 మెట్రిక్‌ టన్నులు, సొసైటీస్‌ దగ్గర 11వేల టన్నులు కంపెనీ గోదాముల్లో 3 వేల టన్నులు మార్క్‌ఫెడ్‌ దగ్గర 6 వేల 500 మెట్రిక్‌ టన్నులు ఉందన్నారు. జిల్లాలో 30 వేల టన్నుల యూరియా ఉన్నదని తెలిపారు. జిల్లాకు వచ్చే రేక్స్‌ వస్తున్నవని, వచ్చినది వచ్చినట్లు వెంట వెంట మూమెంట్‌ అవుతుందని తెలిపారు.

డిఏపీకి, కాంప్లెక్స్‌ ఎరువులకు ఎలాంటి కొరత లేదన్నారు. రైతులకు ఎరువులు ఎంత అవసరమో అంత మేరకే వాడుకోవలసిందిగా కోరారు. సమీక్ష సమావేశంలో డిసిఓ సింహాచలం, డిఏఓ గోవింద్‌, డిఎం మార్కెట్‌ రంజిత్‌ రెడ్డి, ఆర్‌ఎం సీడ్స్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి, రేక్స్‌ పాయింట్‌ అధికారి రవీందర్‌ పాల్గొన్నారు.

Check Also

రెండు ల‌క్షల‌ ఎకరాల‌కు సాగునీరు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్యాకేజీ 20 – 21 ద్వారా నాలుగు నియోజకవర్గాల‌లోని ...

Comment on the article