Breaking News

అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు

నిజామాబాద్‌, జనవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంధుల జీవితాలలో వెలుగులు నింపిన, అంధ విద్యార్థులకు లిపిని కలిపించిన మహనీయుడు లూయిస్‌ బ్రెయిలీ అని నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ అన్నారు.

సోమవారం లూయిస్‌ బ్రెయిలీ 212 వ జయంతి కార్యక్రమాన్ని స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ విద్యార్థుల మధ్య కార్యక్రమం నిర్వహించుకోవటం చాలా సంతోషంగా ఉందని, అంధుల జీవితాలలో వెలుగులు నింపి వారి జీవితానికి ఒక దిశ, దశను చూపిన బ్రెయిలీ మార్గదర్శంలో నడవాలన్నారు.

వైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు, తెలివితేటలకు కాదని నిరూపించారని, ఆ మహనీయుని సేవలు ఎప్పుడు గుర్తుచేసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిడబ్ల్యువో జాన్సీ, ఇందిరా, స్నేహ సోసిటీ వ్యవస్థాపకులు జ్యోతి సిద్దయ్య పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article