Breaking News

జీవన భృతి కోసం కోటగిరిలో ధర్నా

బోధన్‌, జనవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం బీడీలు చేసే ప్రతి ఒక్కరికి 2016 రూపాయల జీవన భతి ఇవ్వాలని తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఏంపీడీవో కార్యాలయం ముందు బీడీ కార్మికులతో సోమవారం ధర్నా చేపట్టారు. కార్మికులు ధరఖాస్తు ఫారాలను సమర్పించారు.

ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా కార్యదర్శి బి మల్లేష్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్లు వేసీ మరో సారి గెలిపించినట్లయితే బీడీ కార్మికులకు జీవన భతిని రెండు వేలకు పెంచి, 2014, ఫిబ్రవరి కట్‌ ఆఫ్‌ డేట్‌ను తొలగించి బీడీలు చేసే ప్రతి ఒక్కరికి ఇస్తాం అని హమీ ఇచ్చారని, కానీ యిప్పటికి ఇవ్వక పోవడంతో జీవన భతి రానటువంటి కార్మికులు ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారని, ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో జి.సీతారాం, బి.సావిత్రి, బి.అరుణ, రజియా బేగం, జి.నాగమణి, ఎ.లక్ష్మి,షబానా బేగం, హేమలత, ఫర్వీన్‌, కరుణ, స్రవంతి, మస్తానా బేగం, హైదర్‌ బీ, అజ్మీరీ తదితరులతో పాటు అధిక సంఖ్యలో బీడీ కార్మికులు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి సంక్షేమానికే పట్టం

బోధన్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ ృద్ధి సంక్షేమ ...

Comment on the article