Breaking News

భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌, జనవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్‌ ఉత్పాదన కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతున్న సమయంలో ట్రాన్స్‌ ఫార్మర్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ప్రమాదాన్ని గుర్తించిన ఉద్యోగులు చాకచక్యంతో వ్యవహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో అక్కడ భారీ ప్రమాదమే తప్పింది. ఆకస్మాత్తుగా మంటలు ఎలా వచ్చాయన్నది ఇంకా తెలియడం లేదు. దీనిపై అప్రమత్తమైన అధికారులు ప్రమాదంపై విచారణ ప్రారంభించారు.

Check Also

కరోనా ల‌క్షణాలు ఉన్నవారు ఇఎస్‌ఐ ఆసుపత్రిలో ఉచిత ఆర్‌టిపిసిఆర్‌ టెస్ట్‌ చేయించుకోవడం ఎలా?

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 1. ఉదయం 6:00 గంటల‌కు ఆధార్‌ కార్డ్‌ మరియు ...

Comment on the article