Breaking News

వేతన ఒప్పందాన్ని అమలు చేయాలి

నిజామాబాద్‌, జనవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఏఐటియుసి ఆధ్వర్యంలో సివిల్‌ సప్లై హమాలి యూనియన్‌ వేతన ఒప్పందం అమలు చేయాలని నిజామాబాద్‌ నగరంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుండి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన నిర్వహించి కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ సివిల్‌ సప్లై హమాలీల స్వీపర్ల గత వేతన ఒప్పందం 2019 డిసెంబర్‌ 31తో ముగిసినా 2020 జనవరి ఒకటో తేదీ నుంచి నూతన వేతన ఒప్పందం అమల్లోకి రావాల్సినా ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం మూలంగా అమలు కాకపోవడంతో గత సంవత్సరంలో సమ్మె చేసిన సందర్భంగా సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ రాష్ట్ర కమిషనర్‌ మరియు చైర్మన్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకత్వంతో అక్టోబర్‌ మాసంలో చర్చలు జరిపి ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు.

కానీ ఒప్పందం జరిగి మూడు నెలలు గడుస్తున్నా నేటికీ సంబంధిత జీవో విడుదల చేయకపోవడంతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు దర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు దిగొచ్చి వెంటనే జీవో విడుదల చేయాలని లేని పక్షంలో జనవరి మూడవ వారంలో రాష్ట్ర కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పేర్కొన్నారు. కావున ప్రభుత్వం దిగొచ్చి ఒప్పందంలో భాగంగా హమాలీల బస్తా రేటు క్వింటాలుకు 23 రూపాయలు, దసరా ఇన్‌ సెంటు ఆరువేల రూపాయలు, బట్టల కుట్టు కూలి వెయ్యి రూపాయలు, స్వీపర్ల వేతనంపై అదనంగా 1700, గ్రాడ్యుయేట్‌ డి బోనస్‌ ఈఎస్‌ఐ సౌకర్యాలను వెంటనే అమలు చేస్తూ జీవో విడుదల చేయాలని ఓమయ్య డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి పి సుధాకర్‌, సివిల్‌ సప్లై హమాలి యూనియన్‌ నాయకులు దేవేందర్‌, బాజన్న, పోశెట్టి, ఫారూఖ్‌ షేర్‌ అలీ, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article