Breaking News

ప్రపంచ ప్రఖ్యాత బాక్స‌ర్‌‌ నిజామాబాద్‌ ముద్దు బిడ్డ

నిజామాబాద్‌, జనవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నెల డిసెంబర్‌లో జర్మనీలో జరిగిన కలోన్‌ బాక్సింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో కాంస్య పతకం సాధించి నిజామాబాద్‌ నగరానికి వచ్చిన ప్రఖ్యాత బాక్సర్‌ హుసాముద్దిన్‌ను తెలంగాణ జాగతి సభ్యులు సోమవారం ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా తెలంగాణ జాగతి రాష్ట్ర నాయకులు నరాల సుధాకర్‌ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బాక్సర్‌ నిజామాబాద్‌ ముద్దుబిడ్డ కావడం సంతోషకరమని అన్నారు. కేవలం తెలంగాణనే కాకుండా మొత్తం భారతదేశం గర్వపడేలా చేశాడన్నారు. కార్యక్రమంలో దండు శ్రీకాంత్‌, రాజేంద్ర ప్రసాద్‌, కొయ్యాడ శంకర్‌, శిక్షకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article