రుణ బకాయిలు వసూలు చేయాలి

కామారెడ్డి, జనవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రుణాల బకాయిల వసూళ్లలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ కోరారు. కామారెడ్డి జనహితలో మంగళవారం రుణాల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. బ్యాంకు లింకేజీ రుణాలు జనవరి 31లోగా వసూలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అర్హతగల వీధి వ్యాపారులకు రుణాలు ఇప్పించాలని సూచించారు. బ్యాంకు లింకేజీ రుణాల వసూళ్లపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. స్త్రీ నిధి రుణాలు అర్హత గల మహిళలకు ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, డిఆర్‌డిఓ చంద్రమోహన్‌ రెడ్డి, మెప్మా పిడి శ్రీధర్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌, అధికారులు పాల్గొన్నారు.

Check Also

కామారెడ్డిలో రంగోళి పోటీలు

కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగతి ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు ...

Comment on the article