మిషన్‌ భగీరథ పనులు 15 లోగా పూర్తిచేయాలి

కామారెడ్డి, జనవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మిషన్‌ భగీరథ పనులు జనవరి 15 లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు. జనహిత భవనంలో మంగళవారం జిల్లాలో మిషన్‌ భగీరథ పథకం ద్వారా చేపడుతున్న పనులపై మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 624 హ్యాబిటేషన్‌లలో 621 ఓఎచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకుల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. బాన్సువాడలో 30 కిలోమీటర్లు పైప్‌లైన్‌ పెండింగ్‌ ఉందని, త్వరలో దానిని పూర్తి చేయాలని సూచించారు.

గ్రామాల్లో ప్రతి ఇంటికి తాగునీటిని అందించే విధంగా కుళాయిలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. జనవరి 15 లోగా పనులు పూర్తి చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, మిషన్‌ భగీరథ ఎస్‌.ఈ. రాజేందర్‌, ఈఈ లక్ష్మీనారాయణ, డీఈలు, ఎఈలు పాల్గొన్నారు.

Check Also

కామారెడ్డిలో 16న వ్యాక్సినేషన్‌

కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ...

Comment on the article