Breaking News

నెలాఖరులోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జనవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కారుణ్య నియామకాలు, పదోన్నతులు, ఎల్‌ఆర్‌యుపి కార్యక్రమాల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామీణ అభివద్ధి శాఖ అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులతో హైదరాబాద్‌ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో సి.ఎస్‌ మాట్లాడారు.

ఈ నెలాఖరులోగా అన్ని కేటగిరీలలో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. పదోన్నతుల విషయమై ఇకపై ప్రతి సోమవారం ఒక గంట కలెక్టర్లు సమయం కేటాయించాలని, కారుణ్య నియామకాల భర్తీపై కూడా దష్టి సారించాలన్నారు. గత నెల డిసెంబర్‌ 31 న రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో భూములకు సంబంధించిన సమస్యలపై చర్చించడం జరిగిందని, పార్ట్‌- బి లో ఉన్న అన్ని కేసులను త్వరితగతిన పరిష్కరించాల్సి ఉందని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు.

ఈ విషయంపై త్వరలో జరగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో కూడా చర్చించనున్నట్లు వెల్లడించారు. ఏదేమైనప్పటికీ రెండు నెలల్లో అన్ని కేసులను పరిష్కరించాలని చెప్పారు. జాయింట్‌ కలెక్టర్‌, ఆర్డీవో, తహసిల్దార్‌ స్థాయిలో ఉన్న అన్ని కేసులు పరిష్కరించాల్సిన అవసరముందన్నారు. పెండింగ్‌ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంపై జిల్లా కలెక్టర్లు దష్టి సారించాలని ఆయన ఆదేశించారు. భూములకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే నేరుగా తన దష్టికి తీసుకురావాలని చెప్పారు. 2020 సంవత్సరంలో అన్ని జిల్లాలలో కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, రూరల్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు, ఇతర అధికారులు బాగా పని చేశారని, ఇందుకుగాను సిఎస్‌ అందరిని అభినందించారు.

రైతు వేదికలు పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని, ఇందుకుగాను రైతు వేదికలలో నీటి సౌకర్యంతో పాటు, విద్యుత్‌, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పల్లె ప్రకతి వనాలు, కళ్లాల నిర్మాణం, చెత్త వేరు చేసే షెడ్డులపై ప్రత్యేక దష్టి సారించి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. నర్సరీలలో మొక్కలు పెంచే విషయంపై సమీక్షిస్తూ ఇప్పటివరకు 83 శాతం పూర్తి చేయడం జరిగిందని, వీటిని కూడా త్వరితగతిన పూర్తిచేయాలని, ముఖ్యంగా నర్సరీ పెంపకంలో వెనుకబడిన జిల్లాలు పురోగతి తీసుకు రావాలని చెప్పారు.

ఉపాధి హామీ పథకం కింద ఈ సంవత్సరం మూడు నెలల్లో ఇంకా బాగా పనిచేసి 7 కోట్ల పని దినాలు కల్పించాలని చెప్పారు. ఇందుకుగాను గ్రామపంచాయతీ, మండల వారీగా పని దినాలు పెంపొందించేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని చీఫ్‌ సెక్రటరీ సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆదేశించిన అన్ని విషయాలపై సమీక్షించి అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు.

ఇప్పటికే ఈ విషయమై అధికారులకు పలుమార్లు సమీక్షించి ఆదేశాలు జారీ చేశామన్నారు. అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, లత, జిల్లా పరిషత్‌ సీఈఓ గోవింద్‌, డిపిఓ జయసుధ, డిఆర్‌డిఓ గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article