Breaking News

ప్రశాంతంగా ప్రారంభమైన యూజీ, పీజీ పరీక్షలు – ఒకరు డిబార్‌

డిచ్‌పల్లి, జనవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో యూజీ, పీజీ పరీక్షలు మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైనాయి. కొవిద్‌ – 19 నిబంధనలను అనుసరించి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం, కంట్రోలర్‌ డా. పాత నాగరాజు శుభాభినందనలు తెలిపారు.

ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు జరిగిన యూజీ రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ పరీక్షలకు మొత్తం 11 వేల 032 నమోదు చేసుకోగా 9 వేల 530 మంది హాజరు, 1 వేయి 502 మంది గైరాజరయ్యారు. పీజీ రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ పరీక్షలకు మొత్తం 2126 నమోదు చేసుకోగా 1887 హాజరు, 239 గైరాజరయ్యారు.

మధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు జరిగిన యూజీ నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ మరియు ఐదవ బ్యాక్‌లాగ్‌ పరీక్షలకు మొత్తం 8920 నమోదు చేసుకోగా 8144 హాజరు, 776 గైరాజరయ్యారని పేర్కొన్నారు. పీజీ మొదటి సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు మొత్తం 439 నమోదు చేసుకోగా 371 హాజరు, 68 గైరాజరయ్యారు. ఎస్‌వి డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో ఒకరు మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ డిబార్‌ అయినట్లు అధికారులు తెలిపారు.

Check Also

సిబ్బంది వివరాలు సేకరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు స్కూల్స్‌ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాల‌ను మండల‌ ...

Comment on the article