Breaking News

పంచాయతీల ఆదాయాన్ని పెంచేలా చూడాలి

కామారెడ్డి, జనవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ సూచించారు. కామారెడ్డి జనహితలో మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. గ్రామ పంచాయతీల వారీగా కూలీల సంఖ్య పెంచే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.

పల్లె ప్రకతి వనంలో నాటిన మొక్కలు వంద శాతం జీవించే విధంగా చూడాలని పేర్కొన్నారు. కంపోస్టు షెడ్లను వినియోగంలోకి తీసుకువచ్చి సేంద్రియ ఎరువులను తయారు చేసి రైతులకు విక్రయించి పంచాయతీల ఆదాయాన్ని పెంచే విధంగా చూడాలన్నారు.

అసంపూర్తిగా ఉన్న వైకుంఠ ధామాలను త్వరిత గతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. లక్ష్యానికి అనుగుణంగా రైతు కలలు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, డిఆర్‌డివో చంద్రమోహన్‌ రెడ్డి, డిపివో సాయన్న, అధికారులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article