కామారెడ్డి, జనవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములను కబ్జా చేస్తున్న వారికి సపోర్టు చేస్తున్న ఏడి శ్రీనివాస్ని సస్పెండ్ చేయాలని బిడిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.ఎన్ఆజాద్ డిమాండ్ చేశారు. బుధవారం వారు మాట్లాడుతూ కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల్ని కొంతమంది కామారెడ్డికి చెందిన వాళ్లు తెర మీద ఉండి తెర వెనకాల మిగతా వాళ్ళ నుండి కబ్జాలు చేయడం జరుగుతుందన్నారు.
ఈ విషయంలో అనేకసార్లు విద్యార్థి సంఘాలుగా పోరాడమన్నారు. కబ్జాలు ఎక్కడ జరుగుతున్నాయో వాటిని సర్వే చేయమని సర్వే అధికారులను, కలెక్టర్ గారిని కోరామన్నారు కలెక్టర్ కూడా సీరియస్గా సర్వే చేయాలని చెప్పారన్నారు. కానీ సర్వే అధికారులు సర్వే నిర్వహించి ఎంక్రోచ్మెంట్ ఎక్కడ జరిగిందో చూపించి ఆ స్థలంలో హద్దులు పొందడంలో మాత్రం విఫలమయ్యారని ఆరోపించారు. కబ్జా ఎక్కడ జరుగుతుందో అక్కడ సర్వే చేయమంటే వాళ్లు అక్కడ కాకుండా కాంట్రవర్సిలేని స్థలంలో సర్వే చేసి చూపిస్తున్నారన్నారు.
అలా కాకుండా ఎక్కడైతే కబ్జాలు జరుగుతున్నాయో అక్కడే సర్వే చేయాలన్నారు. జిల్లా ఏడి శ్రీనివాస్ సర్వే పకడ్బందీగా నిర్వహించండి, ఎక్కడ కబ్జాలు జరుగుతున్నాయో అక్కడ చూపిస్తే అక్కడ కాలేజ్ సిబ్బంది కచ్చితంగా హద్దులు పాతుతారన్నారు. కాలేజీ భూముల్ని కాపాడుకోవడం కోసం కామారెడ్డి విద్యార్థిలోకం వెనక్కి రాదన్నారు. ఏడి ఇప్పటి వరకు కనీసం సర్వే చేయమని అధికారులకు సీరియస్గా చెప్పకపోవడం సిగ్గుచేటన్నారు.
ఏడి భూములను సర్వే చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. సర్వే డిపార్ట్మెంట్లో ఇలాంటి ఏడి ఉంటే కచ్చితంగా కళాశాల భూములకు అన్యాయం జరుగుతుందన్నారు. ముఖ్యంగా సర్వే డిపార్ట్మెంట్లో ఏడిని సస్పెండ్ చేసి కొత్త ఏడిని నియమించిన తర్వాతే సర్వే చేయాలని కోరుతున్నామన్నారు. ఎందుకంటే కామారెడ్డి ఏడి సర్వే డిపార్ట్మెంట్ కబ్జాకోరుల పక్షాన పనిచేస్తుందన్నారు. ఇన్ని రోజులుగా విద్యార్థులు కొట్లాడుతున్నా కనీసం కళాశాల భూముల్లోకొచ్చి ఎక్కడ ఎంక్రోచ్మెంట్ అయిందని అక్కడకి ఒక్కరోజు కూడా సర్వేకు ఏడి రాలేరన్నారు. కబ్జాకోర్టులకు సపోర్ట్ చేస్తే ఏడి ఆఫీస్ ముట్టడించి, ఏడి మీద ఎంత పెద్ద ఉద్యమానికైనా వెనక్కిరామన్నారు.
కళాశాల ఆస్తులను కబ్జా కోరులనుండి కాపాడి సర్వే నిర్వహించమని విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేస్తే, ఏడి శ్రీనివాస్ కళాశాల ఆస్తుల సర్వేను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కళాశాల భూములను కబ్జా చేస్తున్న వారికి మద్దత్తు ఇస్తున్న ఏడి శ్రీనివాస్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, ఎమ్మెల్యే స్పందించి కళాశాల భూములను కాపాడాలని కోరారు. సర్వే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంటే ఊరుకునేది లేదని, ఏడి శ్రీనివాస్ కార్యాలయం ముట్టడి చేస్తామని ఎక్కడ కనిపించినా బుద్ధి చెబుతామనీ హెచ్చరించారు.
ప్రభుత్వం డిగ్రీ కళాశాల భూములను రక్షించి భూముల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేయాలని, కబ్జాకి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోని అరెస్టు చేయాలని, లేకుంటే మళ్లీ బిడిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ధ ఎత్తున ఉద్యమాలు చేస్తామని కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. నూతన విద్యాసంస్థలు నెలకొల్పి నూతన కోర్సులు తేవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బిడిఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విఠల్, జిల్లా అధ్యక్షులు స్టాలిన్, కార్యదర్శి నరేందర్, జాయింట్ సెక్రటరీ భాస్కర్, బిఎంఎం జిల్లా అధ్యక్షులు బులెట్, బిడిఎస్ఎఫ్ నాయకులు సుదర్శన్, మాణిక్యం, సాయికుమార్, కష్ణ, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- రూ.50 వేల విలువచేసే గుట్కా స్వాధీనం - January 19, 2021
- టీఎస్ఐపాస్ అండ్ డిస్టిక్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ సమావేశం - January 18, 2021
- తెలంగాణ పాడి రైతన్నకు ప్రోత్సాహక లబ్ది - January 18, 2021