Breaking News

వ్యాక్సిన్‌కు అన్ని ఏర్పాట్లు చేయండి

నిజామాబాద్‌, జనవరి 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెలలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయనున్నందున అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుదవారం మండల అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, మెడికల్‌ ఆఫీసర్లు, ఎంఈఓలు, ఏపిఓలు, విద్యుత్తు, ఎంపిఓలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా కోవిడ్‌ వాక్సిన్‌, నర్సరీలు, హరిత హారం, క్రిమిటోరియం, డ్రైయింగ్‌ ప్లాటుఫామ్స్‌, లేబర్‌ టర్నౌట్‌, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌లపై సమీక్ష చేశారు.

కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున వారిని చాలా జగ్రతగా మానిటర్‌ చేయాలని మెడికల్‌ అధికారులను ఆదేశించారు. పండుగ తరువాత వాక్సిన్‌ రాబోతున్నదని, జనవరి 8న డ్రై రన్‌ చేయబోతున్నామని, చాలా జగ్రతగా చేయాలని ఆదేశించారు. జిల్లా లో 40 సెంటర్‌ లలో వాక్సిన్‌ అన్ని డ్రై రన్‌ చేస్తామని, మొదటి ఫేస్‌ క్రింద హెల్త్‌, ఐసిడియస్‌కు ఇస్తారని చెప్పారు. వాక్సిన్‌ స్టోరేజ్‌కు పవర్‌ సప్లై అంతరాయం కలుగకుండా చూడాలని యస్‌ఈ ఎలక్ట్రిసిటిని ఆదేశించారు.

అదేవిధంగా ప్రతిదీ ఒక ప్లాన్‌ ప్రకారం చేసుకొని ముందుకు పోవాలని, ప్రతి పిహెచ్‌సిలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని మెడికల్‌ అధికారులను ఆదేశించారు. మెడికల్‌ అధికారులు సమయపాలన పాటించాలని, జనవరి 17న పల్స్‌ పోలియో ఉన్నందున ప్రతి ఒక్కరితో కోఆర్డినేషన్‌ చెసుకొని ముందుకు వెళ్లాలని మెడికల్‌ అధికారులకు ఆదేశించారు. క్రిమటోరియం మంజూరు అయినవి 530, పూర్తి అయినవి 476, 51 పెండింగ్‌లో వున్నవని అన్ని కూడా పండుగ లోపల పూర్తి కావాలని ఆదేశించారు.

జిల్లాలో పల్లె ప్రకతి వనాలు 630 కాగా మంజూరు అయినవి 615, గ్రౌండ్‌ అయినవి 598, పూర్తి అయినవి 563 అని వివరించారు. పండుగ వరకు అన్ని పూర్తి కావాలి. పనులు పూర్తి చేయని వారిపై చర్యలు ఉంటాయని, పెద్ద పెద్ద మొక్కలు పెట్టాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో డ్రైయింగ్‌ ప్లాటుఫామ్‌ను తీసుకోవాలని, మొత్తం మంజూరు అయినవి 3236, మొత్తం గ్రౌండ్‌ అయినవి 2487, పూర్తి అయినవి 950, ఆన్‌లైన్‌లో పేమెంట్‌కు 326 డ్రయింగ్‌ ప్లేట్ఫామ్‌ మాత్రమే చేసినారు కావున మిగతావి కూడా ఆన్‌లైన్‌ చేయాలి. మొదలు కానివి 749 దీనిని ఒక డ్రైవ్‌ లాగా పెట్టుకొని పని చేయండని, కొన్ని మండలంలోని ఎవ్వరు లేక పోవడం వలన క్యాన్సల్‌ చేసినారు, వాటి స్థానంలో కొత్త వారిని తీసుకొని చేయాలి, అంతేకాని రద్దు చేయవద్దు.

డ్రైయింగ్‌ ఫ్లాటుఫామ్లు కొన్ని మండలాల్లో గ్రౌండ్‌ కాకుండా ఉంటే వెంటనే గ్రౌండ్‌ చేయాలి, గ్రౌండ్‌ అయినవి వెంటనే పూర్తి కావాలన్నారు. ప్రతి మండలంలో గ్రౌండ్‌ కావాలని, పనులు జరిగినప్పటికి ఎఫ్‌టిఓ జనరేట్‌ చేయలేదు, కావున వెంటనే జనరేట్‌ చేస్తానే చేసిన పనికి డబ్బులు వస్తాయని కావున వెంటనే జనరేట్‌ చేయాలని ఆదేశించారు. నర్సరీ విషయంలో ప్రతి మండలంలో, ప్రతి జిపి వారీగా ఇచ్చిన నర్సరీ టార్గెట్‌ను ఏ మేరకు చేశారో పరిశీలించారు.

నర్సరీలు 530 టార్గెట్‌ పరంగా 103.32 లక్షలు, బ్యాగ్‌ ఫిల్లింగ్‌ 97.94 లక్షలు సీడ్‌ డిబ్లింగ్‌ 82.43 లక్షలు ప్రతి జిపిలో అవసరము ఉన్న మొక్కలు పెట్టాలి, ప్రతి జిపిలో సాయిల్‌, బ్యాగ్‌లు అన్ని ఫిల్‌ కావాలని, సీడ్‌ ఫిల్లింగ్‌ పూర్తి కావాలని పండుగ వరకు పూర్తి కావాలని ఆదేశించారు. వర్ని మండలం పంచాయతీ సెక్రెటరీ, ఏపిఓపై కలెక్టర్‌ అగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామ పంచాయతీ సెక్రెటరీలు సీడ్‌ డిబ్లింగ్‌, బ్యాగ్‌ ఫిల్లింగ్‌ అన్ని పూర్తి కావాలి లేకుంటే వారిపై చర్యలు ఉంటాయని, హరిత హారంపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందన్నారు.

అదేవిధంగా పల్లె ప్రకతి వనం, అవెన్యూ ప్లాంటేషన్‌లో తప్పకుండా మొక్కలు పెట్టాలని, పెట్టిన ప్రతి మొక్క బ్రతకాలని, రోడ్డు పక్కన ప్రతి 5 మీటర్‌లకు ఒక్క మొక్క పెట్టాలని, హరిత హారంలో ఏ ఒక్క మొక్క చనిపోవద్దని, ఏ మండలంలో ఏ ఒక్క మొక్క ఎండిపోవద్దు, కాలిపోవద్దన్నారు. ట్రీగార్డుకు ప్రక్కన కర్రలు పెట్టాలని, అప్పుడే అవి బాగుగా ఉంటాయని, ఒక వేల మొక్కలు లేకపోతే వారిపై చర్యలుంటాయని, కావున ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వెంటనే పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ గ్రామ పంచాయతీ సెెక్రెటరీలను ఆదేశించారు.

ఉపాధి హామీకి సంబంధించి ప్రతి గ్రామంలో 7 రిజిస్టర్లు వుండే విధంగా చూడాలని, రిజిస్టర్లు ఫైల్స్‌ మైంటైన్స్‌ చేయాలన్నారు. అప్పుడే గ్రామంలో జరుగుతున్న పనులు ఏమేరకు జరుగుతున్నవో తెలుస్తుందన్నారు. ప్రతి గ్రామంలో పంచాయతీ సెక్రెటరీలకు గ్రామంపై ఒక అవగాహన ఉండాలని, ప్రతి గ్రామ పంచాయతీ సెక్రెటరీలకు 7 రిజిస్టర్‌ అవగాహన ఉండాలని, రిజిస్టర్‌లో తీర్మానాలు, గ్రామ సభ వివరాలు ఉండాలని ఆదేశించారు.

ఉపాధి హామీ కూలీలను పెంచాలని గతంలో ఆదేశించామని కాని ఆశించిన మేర కాలేదని కావున గ్రామ పంచాయతి సెక్రెటరీలు బాధ్యతతో పని చేయాలని హెచ్చరించారు. అదేవిధంగా ఏ రోజు ఏ పనులు పెడితే లేబర్‌ వస్తారో చూసుకొని పనులు పెట్టాలని, ప్రతి ఒక్కరికి ఉపయోగం కలిగే విధంగా పనులు పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, శ్రీనివాస్‌ డిఆర్‌డిఓ, గోవింద్‌ జడ్పీ సీఈఓ, డిఎంఅండ్‌హెచ్‌ఓ, మెడికల్‌ ఆఫీసర్‌లు, జయసుధ డిపివో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Check Also

రెండు ల‌క్షల‌ ఎకరాల‌కు సాగునీరు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్యాకేజీ 20 – 21 ద్వారా నాలుగు నియోజకవర్గాల‌లోని ...

Comment on the article