Breaking News

నల్ల చట్టాలు రద్దు అయ్యే వరకు పోరాడతాం

కామారెడ్డి, జనవరి 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మునిసిపల్‌ కార్యాలయం ముందు కేంద్రం ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చెయ్యాలని 6 వ రోజు దీక్ష కొనసాగించారు. దీక్షలో కూర్చున్నవారు సిపిఐ జిల్లా కార్యదర్శి దశరథ్‌, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బండారి రాజిరెడ్డి, సిపిఐ కార్యవర్గ సభ్యులు మంద రాజమణి, ఎర్ర నర్సింలు, మల్లేష్‌, రాజాగౌడ్‌, భీమయ్య, లక్ష్మి, భీమయ్య, రాజు, ఖాసీం మరియు సిపిఐ, ఏఐకెఎస్‌ నాయకులు భీరయ్య, ఎల్లం, రాజిరెడ్డి, దుబ్బాక శ్రీను, పెంటయ్య, రాజేందర్‌, రాజయ్య దీక్షలో పాల్గొన్నారు.

దీక్షనుద్దేశించి భారత కమ్యూనిస్ట్‌ పార్టీ రాష్ట్ర సీనియర్‌ నాయకులు నర్సింహారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చెయ్యాలని, చట్టాల వల్ల చిన్న, సన్నకారు రైతులకు ఏమాత్రం ప్రయోజనం లేకపోగా రైతులు మరింత బానిసలుగా మారతారని పేర్కొన్నారు. కార్పొరేట్‌ ఏజెంట్‌గా నరేంద్ర మోడీ వ్యవరిస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా చర్చల పేరుతొ కాలయాపన చెయ్యకుండా మూడు నల్ల చట్టాలను రద్దు చెయ్యాలని డిమాండ్‌ చేసారు.

లేని యెడల మూడు చట్టాలు రద్దు అయ్యేవరకు భారత కమ్యూనిస్ట్‌ పార్టీ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి దశరథ్‌, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బండారి రాజిరెడ్డి మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చెయ్యాలని, విద్యుత్‌ సవరణ బిల్లు-2020 ని ఉపసంహరించుకోవాలని రైతులు పండించిన పంటలకు కనీస మద్దతుధర (ఎంఎస్‌పి)కి చట్టబద్దత తీసుకురావాలని, జస్టిస్‌ స్వామినాథన్‌ సిఫార్సులను ఖచ్చితంగా అమలు చెయ్యాలని అన్నారు.

జేఏసి కన్వీనర్‌ జగన్నాధం, హన్మంత్‌ గౌడ్‌ (టిపిఎఫ్‌), క్యాతం సిద్దిరాములు అడ్వకేట్‌, నవీన్‌ అడ్వకేట్‌, రైతు సంఘ నాయకులు కట్ల భూమయ్య, నరేందర్‌, ఎల్‌ఎన్‌, అజాద్‌, స్టాలిన్‌, ఇతర గ్రామాల రైతులు సంఘీభావం తెలిపారు.

Check Also

మొదటి విడతలో 12 వేల మందికి వ్యాక్సిన్‌

కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో ఏర్పాట్లపై జిల్లా ...

Comment on the article