నిజామాబాద్, జనవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : న్యాక్ సెంటర్ ఏర్పాటు వలన యువతకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని దుబ్బ బైపాస్‌లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సంస్థ రూ. 6 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే గణేష్ గుప్తా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో జిల్లాలో నిరుద్యోగ యువతకు ఒక భరోసాగా ఒక ధైర్యాన్ని ఇచ్చే సెంటర్‌గా నిలవాలని తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు వత్తి నైపుణ్యాన్ని పెంచి మెరుగుపరిచి వారికి ఉద్యోగ వసతి కల్పించే వారి కాళ్లపై వారు నిలబడేలా వారు సెటిల్ కావడానికి ఉపయోగపడే సంస్థ అన్నారు. నిజామాబాద్ జిల్లా యువత బ్రతుకుదెరువు కోసం గల్ఫ్ వెళుతుంటారు. లేబర్‌గా గల్ఫ్‌కు వెళ్లే వారికి తక్కువ చదువుకున్న వారికి యువతకు, కార్పెంటర్, ఎలక్ట్రిషన్, ప్లంబర్, తాపీ మేస్త్రి, మూడు నెలల, ఆరు నెలల శిక్షణ ఉంటుందని, ఈ రంగాలలో నైపుణ్యత ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తే వాళ్లకు ఉద్యోగ భద్రత జీతాలు ఎక్కువగా ఉంటాయన్నారు. సర్టిఫికెట్ చాలా ప్రాముఖ్యత పెంచుకొని ఉందన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా మూడు నెలలు భోజనం పెట్టి శిక్షణ ఇస్తారన్నారు. కార్యక్రమంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ జనరల్ బిక్షపతి, ఎమ్మెల్సీలు విజీ గౌడ్, రాజేశ్వర్, ఆకుల లలిత, నిజామాబాద్ నగర మేయర్ నీతు కిరణ్, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఆర్బి ఎస్సి రాజశేఖర్ రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- రూ.50 వేల విలువచేసే గుట్కా స్వాధీనం - January 19, 2021
- టీఎస్ఐపాస్ అండ్ డిస్టిక్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ సమావేశం - January 18, 2021
- తెలంగాణ పాడి రైతన్నకు ప్రోత్సాహక లబ్ది - January 18, 2021