అభివృద్ధి పనులు ప్రారంభించిన మేయర్‌

నిజామాబాద్‌, జనవరి 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని 47వ డివిజన్‌ సి ఫ్లెక్స్‌ వద్ద 10 లక్షల రూపాయల పట్టణ ప్రగతి నిధులతో చేపట్టే సీసీ డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్‌ బద్దురి మదులతో కలిసి నగర మేయర్‌ దండునీతూ కిరణ్‌ ప్రారంభించారు. 56, 59వ డివిజన్ల మధ్య మక్కా మస్జీద్‌ వద్ద ఆర్‌.అండ్‌.బి నిధులతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్‌ బాబ్ల్యూ ఖాన్‌తో కలిసి మేయర్‌ ప్రారంబించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గత మూడు నెలలుగా అభివద్ధి కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయని నగరంలోని కొన్ని డివిజన్లలో పనులు ప్రారంభించినవి పూర్తిదశకు వచ్చాయని తెలిపారు. శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్త సహకారంతో నగరంలో అభివద్ధి పనులకు నిధుల కొరత రాకుండా కషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో తెరాస నాయకులు అరుణ్‌, బారి మున్సిపల్‌ ఇంజినీర్‌ పావని, సానిటరీ ఇంచార్జి ఇన్స్‌పెక్టర్‌ ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

పాఠశాలల ప్రారంభానికి ముందస్తు జాగ్రత్త చర్యలు

నిజామాబాద్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం ఫిబ్రవరి ఒకటి నుండి పాఠశాలలు, ...

Comment on the article